E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 17th : దినేష్ బాధ నుంచి బయట పడాలి అంటే నేను కచ్చితంగా ఆ గుణానికి సాయం చేయాలి అప్పుడే వాడు నాకు దినేష్ నుంచి విముక్తి కల్పిస్తాడు అని అనుకుంటుంది. అయితే, బాలు కారు కీస్ ఇస్తాను అని చెప్తుంది.. గుణకి ఎలాగైనా సాయం చేయాలి అని రోహిణి అనుకుంటుంది అసలు గుణ కారు తాళాలు తీసుకుని ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే గుణ మాత్రం రోహిణికి ఇంకాస్త టెన్షన్ పెంచితే తనే తాళాలు తెచ్చి ఇస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మీనా మాత్రం బాలు కోసం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది. బాలు ఏదో ప్రమాదంలో చిక్కుకుంటాడు అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఏదో కీడు శంకుస్తుంది అని మేన బాధపడుతూ వస్తుంది..

శృతి బాలు మాట ఒకటే..

ప్రభావతి మీనా తెచ్చిన తాయత్తును చూసి వీడికి ప్రమాదం ఏముండదు వీడు వల్లే ఇంకొకరికి ప్రమాదం ఉంటుంది తప్ప వీడికి ఏ ప్రమాదం ఉండదు నువ్వేం కంగారు పడకు అంటూ అనేసి వెళ్ళిపోతుంది. కానీ మీనా మాత్రం మీరు ఆ తాయత్తుని కట్టుకోవాల్సిందే నా కోసమైనా కట్టుకోవాలి అని ఎంత బ్రతిమలాడినా కూడా బాలు మాత్రం నేను అస్సలు కట్టుకొని అంటాడు. అయితే మేన వంట గదిలో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి ఏంటి మీనా పాలు పొంగిపోతున్న కూడా చూడకుండా ఎక్కడో నీ మనసు ఉంది అని అంటుంది. అయితే నాకు ఏమి కాలేదు శృతి నేను ఇక్కడే ఉన్నాను అని అంటే శృతి నిజం చెప్పు మీనా నువ్వు ఎక్కడ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడే బాలు గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పగానే ఇవన్నీ నమ్మకాలు ఈ రోజుల్లో లేవు నువ్వు ఏమి కంగారు పడొద్దు అని శృతి చెప్తుంది అప్పుడే వచ్చిన బాలు కూడా శృతికి సపోర్ట్ గా మాట్లాడడంతో మీరిద్దరూ ఒక్కటే అని మీనా అంటుంది..

రోహిణి ఇరుక్కుంటుందా..?

Advertisement

బాలు మీనా దగ్గరికి వెళ్లి నువ్వు ఏమి టెన్షన్ పడవద్దు నాకు ఏమీ కాదు మంచోళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అండగనే ఉంటాడు నువ్వు కంగారుపడి నన్ను బాధ పెట్టొద్దు అని ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం నా కోసమే నువ్వు ఆ కంకణం కట్టుకోవాలి అని అంటుంది.. ఇకపోతే బాలు మనము రేపు చింటూ స్కూల్ కి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనుకున్నాం కదా దాని గురించి ఆలోచించు అని అంటాడు వీళ్ళిద్దరూ ఆ మాట మాట్లాడటం విన్న రోహిణి ఎలాగైనా సరే బాలుని రేపు స్కూల్ కి వెళ్ళనివ్వకుండా చేయాలి అని అనుకుంటాడు. అయితే బాలు ఆ మాట అనగానే రోహిణి విని ఏదో ఒకటి చేయాలి ముందు ఆ గుణానికి సాయం చేస్తే బాలు రేపు స్కూలుకు వెళ్లకుండా ఉంటాడు అని ఆలోచిస్తుంది రోహిణి. నువ్వు నాకు ఫోన్ చేసి ఎలాగైనా సరే బాలుని స్కూల్ కి వెళ్ళనివ్వకుండా చేయాలి అని కారు తీసేస్తానని అంటుంది. బాలు నిద్రపోగానే ఆ పని చేయాలని దొంగగా మారుతుంది కానీ శృతి టెన్షన్ పడిపోతుంది.

భయపడ్డ శృతి..

శృతి గదిలో కరెంటు పోయింది అని చెప్పేసి కిటికీలు ఓపెన్ చేస్తుంది అయితే ఈ అప్పుడే ఒక షాడో లాంటిది అలా వెళ్లడంతో ఎవరు అటు వెళ్తున్నారు అని రవితో చెప్తుంది. అయితే రవి ఎవరో దొంగలు అనుకుంటాను అని భయపడుతూ ఉంటాడు. ఆ దొంగ ఎవరో మనం కూడా కనిపెట్టాలి పదా అనేసి రవిని తీసుకొని శృతి బయటికి వస్తుంది. అయితే అక్కడే ఉన్నా మీనా బాలు దొంగ దొంగ అని గట్టిగా అరవడంతో ఎక్కడ దొంగ ఎవరు దొంగ అంటూ బాలు అంటాడు ఇది కాస్త ఎపిసోడ్ కి కామెడీగా అనిపిస్తుంది.. శృతి రవి వాళ్ళు దొంగ దొంగ అని గట్టిగా రావడంతో రోహిణి వెళ్లి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఎవరో దొంగ అలా వెళ్లడం నేను చూసాము వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ ఎవరో లోపలికి వచ్చారు అంటే తలుపులు వేయకముందే లోపలికి వచ్చారా అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు..

రోహిణికి బడితపూజ..

Advertisement

రోహిణి ఎలాగైనా సరే చీకట్లో వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. అయితే మనోజ్ వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉండగా మనోజ్ కి తగలడంతో దొంగ దొంగ అంటూ రోహిణి పట్టుకొని గట్టిగా అందరు కొట్టేస్తారు. ఫీజు పెట్టడానికి వెళ్లిన బాలు దాని పెట్టగానే కరెంట్ వస్తుంది అయితే ఆ దొంగని రోహిణి అని తెలుసుకుని ఏంటి నువ్వే దొంగతనానికి వచ్చావా అని శృతి అంటుంది నేను దొంగతనానికి కాదు పైనుంచి కిందకి వచ్చాను ఫోన్ కిందపడితే తీసుకుంటూ ఉండగా మనోజ్ కి తగిలింది దాంతో మనోజ్ నన్ను దొంగ దొంగ అని కొట్టాడు అని చాలా ఫీల్ అవుతుంది. అయితే ఇందాక అలా వెళ్ళింది కూడా నువ్వేనా అంతే లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇప్పుడే పైనుంచి వస్తున్నాను అని రోహిణి అంటుంది అయితే అందరూ నిజమే అని అనుకుంటారు.

మీనాకు టెన్షన్..

బాలుకి ఏదైనా జరుగుతుందేమో అని మీన మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది. బాలుని ఎలాగైనా కాపాడుకోవాలి ఆయనకి ఏం కాకుండా చూసుకోవాలి అని కంగారు పడిపోతూనే ఉంటుంది. అయితే బాలు మాత్రం మీనాని ఆ ఆలోచన నుంచి పక్కకు తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అప్పుడే చింటూ దగ్గరికి వెళ్ళేసి వస్తాము అని అంటారు కానీ కారుకిస్ కనిపించలేదు అని వెతుకుతూ ఉండగా మనోజ్ ఇక్కడే ఉన్నాయి రా అని తెచ్చి ఇస్తాడు. ఇక అందరూ కలిసి చింటు దగ్గరికి ఎందుకు అని అడుగుతారు కానీ బాలు ఆ సుగుణమ్మ దగ్గరికి వెళ్లి ఆ బాబును తీసుకొని వస్తాము అని అంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు కారులో ఏదో దాచిపెట్టిన గుణ గురించి తెలిసిపోతుందా? రోహిణి బండారం బయటపడుతుందా చూడాలి..

Also Read :శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×