E-Paper
Advertisement

Bhupalpally Collector: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ!

Bhupalpally Collector: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి:  కలెక్టర్ రాహుల్ శర్మ!
Advertisement

Bhupalpally Collector: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ క్రీడా మైదానంలోని మినీ ఫంక్షన్ హాల్‌ను, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాట్ల కోసం గదులను కలెక్టర్ పరిశీలించారు. అంబేద్కర్ స్టేడియంలో టెంట్లు ఏర్పాటు చేసి, వార్డు వారిగా డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామగ్రి సమగ్రంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Also ReadJangaon Collector: ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్ రిజ్వాన్ భాషా కీలక సూచనలు!

స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలి

Advertisement

బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచేందుకు స్టేడియంలోని గదులలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్‌లో గాలి, వెలుతురు లేకుండా కిటికీలు, వెంటిలేటర్లను పూర్తిగా మూసివేయాలని సూచించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం మినీ ఫంక్షన్ హాల్‌లో వార్డు వారిగా కౌంటర్లు ఏర్పాటు చేసి, బ్యారికేడింగ్ చేయాలని తెలిపారు.

పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సిబ్బందికి త్రాగునీరు, విద్యుత్ సరఫరా, టెంట్ల ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ జోన, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ తరుణ్ ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Also Read:Collector Santosh: భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్! 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×