Big TV Chairman:బిగ్ టీవీ ఢిల్లీ కరస్పాండెంట్ శివకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.ఈ ప్రమాదంలో శివ ఎడమ చేయి, ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఇక ఎమర్జెన్సీ గా ట్రీట్ మెంట్ అందించాల్సి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శివ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, సర్జరీ చేయడం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని డాక్టర్స్ స్పష్టం చేశారు.
బిగ్ టీవీ యాజమాన్యం దృష్టికి వెళ్లడతో,
ఇక ఈ విషయం బిగ్ టీవీ యాజమాన్యం దృష్టికి వెళ్లడతో, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రియాక్ట్ అయ్యారు. తన ఉద్యోగికి చికిత్సకు కావలసిన రూ. 12 లక్షల భారీ మొత్తాన్ని తక్షణమే విడుదల చేసి పెద్ద మనసు చాటుకున్నారు. సొంత రాష్ట్రం నుంచి ఢిల్లీ వచ్చి బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక సాధారణ ఉద్యోగికి ఈ ఆర్థిక సాయం కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు
ఇలా కష్ట సమయంలో ఉద్యోగికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిన చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మీడియా వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
అభినందనీయమన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్
ఇక ఈ సహాయంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJF) కూడా ప్రత్యేకంగా స్పందించింది. TWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి. రాంచందర్ యాదవ్, బి. బసవపున్నయ్యలు యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సాదాసీదా ఉద్యోగుల పట్ల ఇంతటి మానవత్వంతో వ్యవహరించడం, వారి అత్యవసర పరిస్థితులను గుర్తించి ఆదుకోవడం ఎంతో అభినందనీయమని వారు మెచ్చుకున్నారు.
మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం
కష్టకాలంలో తోడుగా నిలిచే వ్యక్తులు, సంస్థలే నిజమైన నాయకులుగా నిలుస్తారని, జర్నలిస్టుల సంక్షేమానికి బిగ్ టీవీ అందిస్తున్న ఈ సహకారం సమాజానికి మరియు ఇతర మీడియా సంస్థలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని వారు తెలిపారు.ఉద్యోగుల పట్ల కేవలం యజమానిగా కాకుండా, ఒక కుటుంబ పెద్దగా బాధ్యత వహించిన బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి నిర్ణయం మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందనడం లో సందేహం లేదు !
ALSO READ :రిపోర్టర్కు బ్రెయిన్ స్ట్రోక్.. రూ.12 లక్షలు ఇచ్చి ఆదుకున్న బిగ్ టీవీ ఛైర్మన్.. సర్వత్రా ప్రశంసలు!