E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  

Nindu Noorella Saavasam Serial Today Episode October 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నాటకాన్ని వైజయంతి కనిపెట్టిందా..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని, సరస్వతి వార్డెన్‌ను హాల్లో కూర్చోబెట్టి ఇద్దరినీ ఒకేసారి ఇంటరాగేషన్‌ చేస్తుంది వైజయంతి. నేరుగా మనోహరితో పార్థును ఎందుకు చంపేశావు.. అని అడుగుతుంది. వైజయంతి మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది. అందరూ ఉలిక్కిపడి చూస్తుంటారు. ఈవిడేంటి ఇంత డైరెక్టుగా మనోహరికి షాక్‌ ఇచ్చారు అని చంభా అనుకుంటుంది. వెంటనే ఐమీన్‌ నీ వల్లే కదా పార్థు చనిపోయాడు అంటుంది. మనోహరి ఏం మాట్లాడుతున్నారు మేడం నా వల్ల చనిపోవడం ఏంటి..? పార్థును నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. అటువంటిది నా వల్ల పార్థు చనిపోవడం ఏంటి..? అంటూ మనోహరి ప్రశ్నిస్తుంది. అందుకు వైజయంతి కూల్‌గా చూడు మనోహరి పెళ్లికి ముందు పార్థు మీద రెండు సార్లు అటాక్‌ జరిగింది. నాకు తెలిసి పార్థుకు శత్రువులు ఎవరూ లేరు. ఆ అటాక్‌ చేసింది నీకోసం అయ్యుండొచ్చు పార్థు నిన్ను కాపాడి ఉండొచ్చు అని చెప్తుంది.

అందుకు మనోహరి అయ్యుండొచ్చు మేడం అని చెప్పగానే.. అయితే నీకు శత్రువులు ఎవరున్నారు..? ఎందుకున్నారు..? ఇంతకీ వాళ్లు ఎవరై ఉండొచ్చని అనుకుంటున్నావు అని వైజయంతి అడిగితే… ఏమో మేడం నాకు తెలిసి అరుంధతిని చంపిన వాళ్లే అయ్యుండొచ్చు అంటూ మనోహరి చెప్పగానే.. అరుంధతిని చంపినవాళ్లు నిన్ను ఎందుకు చంపాలనుకుంటారు…? అంటూ వైజయంతి అడిగితే ఆ విషయం నాకెలా తెలుస్తుంది మేడం అంటుంది మనోహరి. తర్వాత వైజయంతి, సరస్వతి వార్డెన్‌ను మనోహరి ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతుంది. పసికందుగా ఉన్నప్పటి నుంచి తెలుసు అని వార్డెన్‌ చెబితే.. అరుంధతి ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇంచుమించు ఇద్దరు ఒకేసారి ఒకే వయసు నుంచి తెలుసు అని చెప్తుంది వార్డెన్‌. అయితే వాళ్లిద్దరిని పెంచి పెద్ద చేసింది మీరేనా అని అడిగితే అవునని వార్డెన్‌ చెప్తుంది. వీళ్లిద్దరు ఎలా ఉండేవారని వైజయంతి అడిగితే.. చాలా స్నేహంగా అన్యోన్యంగా ఉండేవారని చెప్తుంది వార్డెన్‌.

Advertisement

అయితే వీళ్లిద్దరికీ శత్రువులు ఎవరైనా ఉన్నారా..? అంటే అరుంధతి ఉన్న చోట శత్రువ్వం ఉండదని అసలు ఆశ్రమంలో ఎవరైనా పస్తులు ఉండాల్సి వస్తే అరుంధతి ఉండేదని.. అందరికీ మంచి బట్టలు ఇచ్చి తాను చిరిగిన చొక్కాలు వేసుకునేదని తను ఆకలితో ఉంటూ మరొకరి కడుపు నింపేదని గొప్పగా చెప్తుంది వార్డెన్‌. మరి మనోహరి ఎలా ఉండేది అని వైజయంతి అడిగితే నిజం చెప్పొద్దని మిస్సమ్మ, వార్డెన్‌కు సైగ చేస్తుంది అంతా వైజయంతి గమనిస్తుంది. వార్డెన్‌ ఏం చెప్తుందోనని మనోహరి భయం భయంగా చూస్తుంది. వార్డెన్‌ మాత్రం కూల్ గా తాను అరుంధతి స్నేహితురాలు కదా మేడం తను కూడా అలాగే ఉండేది అని చెప్పగానే.. తర్వాత ఏం జరిగిదనేది మొత్తం వార్డెన్‌ చెప్తుంది. మనోహరిని చూడటానికి వచ్చిన అమర్‌, అరుంధతిని పెళ్లి చేసుకోవడం మనోహరి కోల్‌కతా వెళ్లిపోవడం తర్వాత తిరిగి వచ్చి అరుంధతి ఇంట్లోనే ఉండటం గురించి చెప్తుంది. అయితే కోల్‌కతా వెళ్లి ఏం చేసేదానివి అంటూ.. వైజయంతి అడుగుతుంది.

అక్కడ ఆశ్రమంలో సేవ చేసేదాన్ని అని మనోహరి చెప్తుంది. మళ్లీ హైదరాబాద్‌ ఎందుకు వచ్చావని వైజయంతి అడిగితే.. అరుంధతిని చూడాలనిపించి వచ్చానని చెప్తుంది. అప్పుడే అరుందతి చనిపోయింది కదా అని వైజయంతి అడిగితే.. మనోహరి షాక్‌ అవుతుంది. తల తిరుగుతున్నట్టు యాక్టింగ్‌ చేస్తుంది. తాను రెస్ట్‌ తీసుకుంటానని అడుగుతుంది. అందుకు వైజయంతి రెస్ట్‌ తీసుకో కానీ ఇక్కడి ఆశ్రమం విషయాలు సరస్వతి గారు చెప్పారు.. కానీ కోల్‌కతాలో నువ్వేం చేశావో ఎవరు చెప్తారు అని వైజయంతి అడిగితే.. రణవీర్‌ చెప్తాడు మేడం అని రాథోడ్‌ అంటాడు. అందరూ షాక్‌ అవుతారు. వైజయంతి మాత్రం రణవీర్‌ ఎవరు మనోహరి అని అడుగుతుంది. మనోహరి తల పట్టుకుని కూలబడిపోతుంది నాకు మాట్లాడే ఓపిక లేదు యాదమ్మ నన్ను రూంలోకి తీసుకెళ్లు ప్లీజ్‌ అంటుంది. యాదమ్మ, మనోహరిని తీసుకెళ్తుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన మిథిలేష్.. నిజమవుతుందా?

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

Big Stories

Advertisement
×