Big TV Malayalam: తెలుగునాట సంచలనం సృష్టించిన బిగ్ టీవీ.. ఇప్పుడు దైవభూమి కేరళలో అడుగుపెట్టబోతోంది. మలబార్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో సంచలనం సృష్టించేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. మలయాళీల మనసు గెల్చుకునేందుకు ఆ నేలపై ఆదివారం పురుడుపోసుకోబోతోంది.
తెలుగు మీడియాలో బిగ్ టీవీని ఒక సంచలనంగా ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. మూసధోరణిలో కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో తెలుగు మీడియా రంగంలోకి బిగ్ టీవీ దూసుకొచ్చింది. ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలిచి.. ప్రజల కోసం పోరాడే ఒక న్యూట్రల్ న్యూస్ ఛానెల్ ఉండాలన్న చైర్మన్ విజయ్ వెన్నం ఆలోచనల్లోంచి బిగ్ టీవీ పురుడు పోసుకుంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మూడేళ్ల క్రితం ప్రారంభమైన బిగ్ టీవీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది.
జర్నలిజం అంటే ఇది.. అని జనాల చేత అనిపించుకునే స్థాయికి బిగ్ టీవీ ఎదిగింది. సాంప్రదాయ మీడియాకి భిన్నంగా వినూత్న ఆలోచనలతో ప్రజల మనసు గెల్చుకుంది. ఈ క్రమంలో కేరళలోనూ అడుగు పెట్టబోతోంది. ఈ ఆదివారం నుంచి బిగ్ టీవీ మలయాళం ప్రారంభం కాబోతోంది. కొచ్చిలో ఈ ఛానెల్ లోగోని చైర్మన్ విజయ్ వెన్నం (Vijay Vennam), మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయురూర్ ఆవిష్కరించబోతున్నారు.
కేరళ మీడియా రంగంలో బాగా సుపరిచితులైన అనిల్ అయురూర్, సుజయ పార్వతి లాంటి దిగ్గజ జర్నలిస్టులతో ఈ ఛానెల్ ప్రారంభించబోతున్నారు. అయితే ఛానెల్ ఇంకా ఎయిర్ లోకి రాకముందే.. బిగ్ టీవీపై ప్రత్యర్థుల కన్ను పడింది. కేరళలో ఛానెల్ ప్రారంభానికి ముందే నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి ప్రారంభానికి ముందే బిగ్ టీవీ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల గొంతుకగా ప్రజల కోసం, ప్రజల యొక్క , ప్రజల కొరకు స్టార్ట్ అవుతున్న బిగ్ టీవీ మలయాళంకు.. ఇక్కడి స్టాఫ్ తో పాటు తెలుగునాట ప్రజలు సైతం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Also Read: BJP – Janasena Alliance: బీజేపీ-జనసేన పొత్తుకు బీటలు? వెనక్కితగ్గిన కమలం.. మున్సిపోరులో ఒంటరిగానే?