E-Paper
Advertisement

Big TV: మీడియా అంటే ‘వైట్ ఎలిఫెంట్’ కాదు.. ప్రజా సేవకు పీఠం: విజయ్ రెడ్డి

Big TV: మీడియా అంటే ‘వైట్ ఎలిఫెంట్’ కాదు.. ప్రజా సేవకు పీఠం: విజయ్ రెడ్డి
Advertisement

నిజాయితీ, నిర్భీతితో కూడిన జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ‘బిగ్ టీవీ’ తన సరిహద్దులను విస్తరిస్తోంది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా.. పక్క రాష్ట్రాల్లో కూడా బిగ్ టీవీ పేరు మారు మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు కేరళ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్ విజయ్ రెడ్డి వెన్నం తన దార్శనికతను పంచుకున్నారు.

జర్నలిజం విలువలపై రాజీలేని పోరాటం..

Advertisement

‘నిజాన్ని నిర్భయంగా, పక్షపాత రహితంగా చెప్పడమే బిగ్ టీవీ పాటించే జర్నలిస్టిక్ విలువల సారం’ అని విజయ్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి కాలంలో వార్తలకు రంగులు అద్దుతున్న తరుణంలో.. అసలైన వార్తను ప్రజలకు చేరవేయడమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’(ఎవరికీ భయపడకుండా, ఎవరికీ లొంగకుండా) అనే ట్యాగ్‌లైన్ కేవలం మాటలకే పరిమితం కాదని, అది తమ సంస్థ డీఎన్ఏలోనే ఉందని ఆయన వివరించారు.

కేరళను ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే..?

Advertisement

దక్షిణాదిలో కేరళను ఎంచుకోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని వివరిస్తూ.. ‘కేరళ అత్యంత వృత్తి నైపుణ్యం (Professionalism) కలిగిన రాష్ట్రం. అక్కడ ప్రజలకు సామాజిక అంశాలపై అవగాహన ఎక్కువ. అందుకే అక్కడ ఛానెల్ ప్రారంభించాలని నిర్ణయించాం’ అని విజయ్ రెడ్డి తెలిపారు. కేరళ ఒక న్యూస్ ఓరియెంటెడ్ స్టేట్ అని.. అక్కడ నాణ్యమైన వార్తలకు, విశ్లేషణలకు తగిన ఆదరణ లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేరళలో విజయం సాధించిన తర్వాతే ఇతర రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.

మీడియాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే లక్ష్యం..

మీడియా రంగంపై సమాజంలో ఉన్న ప్రతికూల భావనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది మీడియా ఛానెళ్లు అంటే వైట్ ఎలిఫెంట్ అని.. అంటే కేవలం ఖర్చుతో కూడుకున్న వ్యాపారమని భావిస్తారు. ఈ అభిప్రాయాన్ని మార్చాలన్న కృతనిశ్చయంతో మేము ఉన్నాం’ అని విజయ్ రెడ్డి అన్నారు. వార్తా సంస్థ అంటే కేవలం లాభాపేక్ష కలిగిన వ్యాపారం మాత్రమే కాదు.. అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఒక వ్యవస్థ అని ఆయన వివరించారు.

విశ్లేషణే మా ఆయుధం..

వార్తలను కేవలం సమాచారంగా కాకుండా.. వాటి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేలా బిగ్ టీవీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఎడిటోరియల్, విశ్లేషణాత్మక కథనాలపైనే బిగ్ టీవీ అత్యధికంగా ఫోకస్ చేస్తుందని, ప్రజల సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉపయోగపడే అంశాలను హైలైట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాపక్షం వహించి, పారదర్శకమైన సమాజం కోసం బిగ్ టీవీ కృషి చేస్తుందని విజయ్ రెడ్డి వెన్నం ఆశాభావం వ్యక్తం చేశారు.

‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’.. జర్నలిజం విలువలే బిగ్ టీవీ ప్రాణం..

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×