E-Paper
Advertisement

vastu dosha: వాస్తు దోషాలతో కష్టాలు పడుతున్నారా..?  ఈ చిన్న రెమెడీస్ వాస్తును సెట్ చేస్తాయట

vastu dosha: వాస్తు దోషాలతో కష్టాలు పడుతున్నారా..?  ఈ చిన్న రెమెడీస్ వాస్తును సెట్ చేస్తాయట
Advertisement

vastu dosha: ఇంట్లో వాస్తు దోషాలతో కష్టాలు పడుతున్నారా..? నెగెటివ్‌ ఎనర్జీతో అన్ని ఇబ్బందులు పడుతున్నారా..? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రెమెడీస్‌ పాటిస్తే ఇంట్లో వాస్తు దోషాలన్నీ పరారవుతాయని పండితులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పు సింహ ద్వారం:

తూర్పు వైపు మెయిన్‌ డోర్‌ ఉన్న వారు. ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం, వేసి మూటకట్టి, దానిని ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడ తీయాలట. ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

పడమర సింహ ద్వారం:

Advertisement

ఎవరి ఇంటికైతే పడమర ఫేస్‌లో ప్రధాన గుమ్మం ఉంటుందో వాళ్లు ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోయేందుకు శనివారం రోజు నీలం రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం పోసి అంతే బరువు ఉన్న పత్తి గింజలు, కాస్త కర్పూరం, వేసి మూట కట్టి దాన్ని  ప్రధాన గుమ్మానికి వేలాడ తీయాలట. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఉత్తర సింహ ద్వారం:

ఇంటికి ఉత్తర ముఖ ద్వారం ఉన్నట్లయితే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే.. అలాంటి వారు బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకుని మూట కట్టాలట. అలా కట్టిన మూటను ఆ ఇంటి సింహ ద్వారం అంటే ప్రధాన గుమ్మం పైన వేలాడ దీయాలట. ఆలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ హరించుకుపోతాయని ఇంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతతో పాటు అన్ని రకాల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.

దక్షిణ సింహ ద్వారం:

Advertisement

ఎవరి ఇంటికైతే దక్షిణ ముఖంగా ప్రధాన ద్వారం ఉంటుందో ఆలాంటి ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అందుకోసం ఈ పరిహారం చాలా అద్బుతంగా పని చేస్తుందని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఇంట్లో ఉన్న వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయట. అవి రాకుండా ఉండేందుకు మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక కలబందను తీసుకుని ఇంటిక ప్రధాన గుమ్మం దగ్గర లోపల వైపు పై నుంచి కిందకు తలకిందులుగా వేలాడతీయాలని వాస్తు శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. అలాగే వాస్తు దోషాలు తొలిగిపోయేందుకు ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక కేజీ పటిక బెల్లం వేసి మూట కట్టాలట. తర్వాత ఆ మూటను ఇంట్లో ప్రధాన గుమ్మం దగ్గరే కలబంద వేలాడదీసిన దగ్గర వేలాడదీయాలట. అలాగే అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే శాస్త్రోక్తంగా ప్రధాన గుమ్మం దగ్గరే ఒక బూడిద గుమ్మడి కాయను వేలాడదీయాలని సూచిస్తున్నారు. దీని వల్ల కూడా ఇంట్లో వాస్తు దోషాలు హరించుకుపోతాయట. దక్షిణ సింహ ద్వారం ఉన్న వాళ్లు ఈ మూడు రెమెడీస్‌ చేయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట. అయితే గుమ్మడికాయ మురిగిపోతే మళ్లీ అమావాస్య వచ్చినప్పుడు మారుస్తుండాలని సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శివరాత్రి తర్వాత లక్ష్మీ నారాయణ యోగం – ఆ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×