E-Paper
Advertisement

BIG TV: బిగ్‌టీవీపై కుట్రలు సాగవు.. మలయాళం ఎంట్రీపై వస్తున్న దుష్ప్రచారానికి బిగ్ రియాక్షన్!

BIG TV: బిగ్‌టీవీపై కుట్రలు సాగవు.. మలయాళం ఎంట్రీపై వస్తున్న దుష్ప్రచారానికి బిగ్ రియాక్షన్!

BIG TV: బిగ్‌టీవీపై మళ్లీ కుట్ర మొదలయ్యింది. సోషల్ మీడియాలో నోటికొచ్చింది వాగుతూ బురద జల్లే ప్రయత్నం జోరుగా సాగుతోంది. తెలుగు శాటిలైట్ న్యూస్ చరిత్రలో అత్యంత వేగంగా ఎదిగిన బిగ్‌టీవీ.. మలయాళం న్యూస్ ఛానల్ ప్రారంభించడం చాలామందికి కడుపుమంటను రగిలించినట్లుంది. అందుకే.. ఏదేదో ఆపాదిస్తూ సోషల్ మీడియాలో చెత్తవాగుడంతా వాగుతున్నారు.. ఈ దుష్ప్రచారానికి బిగ్ టీవీ సమాధానం ఇదే..

బిగ్‌టీవీ మలయాళ ఛానల్ ప్రారంభం వెనుక కథేంటి..?

తెలుగులో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదారణ పొందిన బిగ్‌టీవీ ఛానల్‌, ఇప్పుడు మలయాళంలో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించడంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. బిగ్‌టీవీని టార్గెట్ చేస్తూ కొంతమంది కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు కోసమే మలయాళంలో బిగ్‌టీవీ ప్రారంభిస్తున్నారని, దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

కేరళ ఎన్నికలకు 1000 కోట్ల ఫండింగ్ చేయడం కోసమే అంటూ ఇప్పుడు మరో ప్రచారం మొదలుపెట్టారు. నమస్తే తెలంగాణ లాంటి పత్రిక కూడా బిగ్‌టీవీ అర్థం వచ్చేలా బ్యానర్ కథనాలను సైతం ప్రచురించింది. ఇలా ఆరోపణలు చేస్తున్న వారందరికీ బిగ్‌టీవీ సవాల్.. మీరు ప్రచారం చేస్తున్నట్లు వెయ్యి కోట్లు కాదు.. అందులో 0.001 పర్సెంట్ అంటే .. కనీసం లక్ష రూపాయలైనా ఫండింగ్ వచ్చినట్లు నిరూపించగలరా..? దొంగ ఐడీల వెనక దాక్కుని దుష్ప్రచారం చేయడం కాదు.. దమ్ముంటే ముందుకు వచ్చి నిరూపించండి.

బిగ్ టీవీ మలయాళం ఇప్పుడే ఎందుకు..?

తెలుగులో ఇప్పటికే అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకుంది బిగ్‌టీవీ. ఎన్నికల సర్వేలు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు, ఇన్‌డెప్త్ స్టోరీలు, పబ్లిక్ ఇష్యూలు అన్నింటి కవరేజ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో పెద్ద ఛానల్స్ అనుకునే వాటిల్లో ఒకటిగా నిలబడింది. మీడియా రంగంలో మరింత విస్తరించే వ్యూహంలో భాగంగానే ఇప్పుడు కేరళలోకి అడుగుపెట్టింది. మలయాళంలో బిగ్‌టీవీ ప్రారంభించడం వెనుక.. సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌ మాత్రమే కాదు ఏ ఇతర కాంగ్రెస్‌ నేతలకూ ఎలాంటి సంబంధం లేదు.

మీడియా రంగంలో అత్యంత పోటీ ఉండే కేరళను ఎంచుకోవడం పూర్తిగా వ్యూహాత్మకమే తప్ప దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అన్న నినాదంతో వెళ్తున్న బిగ్‌టీవీ ఎప్పుడూ ప్రజల పక్షమే తప్ప పార్టీల పక్షం కాదు. మేం అన్ని పార్టీల్లో మంచినీ చూపిస్తాం.. చెడునూ చూపిస్తాం. ఎన్నికల సమయంలో అందరి దృష్టి న్యూస్ ఛానల్స్ ఎక్కువగా ఉంటుంది, ప్రజల్లోకి వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ కారణంతోనే కేరళలో ఇప్పుడు అడుగు పెట్టాం. త్వరలోనే కర్ణాటకలోనూ ప్రారంభిస్తాం. మిగిలిన రాష్ట్రాల్లోనూ ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నాం. దీనిపై బిగ్‌టీవీ చైర్మన్ విజయ్ వెన్నం గతంలోనే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.

ఎందుకీ కడుపుమంట..?

బిగ్‌టీవీ రాకను, ఎదుగుదలను ముందునుంచి ఓర్చుకోలేని ఓ వర్గం పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తోంది. తెలుగులో శాటిలైట్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఆ వర్గం గుప్పిట్లో ఉన్నప్పుడు బిగ్‌టీవీ పుట్టింది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ, పూర్తిగా ప్రజల నాడినే ప్రతిబింబిస్తూ అతి తక్కువ కాలంలోనే విశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్‌టీవీ ఇచ్చిన సర్వేలు పక్కాగా రావడమే అందుకు నిదర్శనం. ఆ సర్వేలు వచ్చినప్పుడు కూడా కొంతమంది బిగ్‌టీవీపై ఎన్నో నిందలు వేశారు, కానీ జనం ఇచ్చిన తీర్పు, బిగ్‌టీవీ అంచనాలు మ్యాచ్ కావడంతో వారి గొంతులు పెగల్లేదు. అందుకే అప్పటి నుంచి బిగ్‌టీవీని టార్గెట్ చేస్తూ ఏదో రకంగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇలా మీరు చేసే దుష్ప్రచారం బిగ్‌టీవీ ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బ తీయదు.

బిగ్‌టీవీ ఎప్పుడూ ఓ రాజకీయ పార్టీ పక్షాన ఉండలేదు. అన్ని పార్టీల్లోనూ ఉన్నది ఉన్నట్లుగానే జనానికి చూపించే ప్రయత్నం చేసింది. చేస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా అదే పంథాను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ చానల్ అంటూ బిగ్‌టీవీపై ముద్ర వేసి జనంలో కొంతమందికే పరిమితం చేయాలన్న కుట్ర చాలాకాలంగా సాగుతోంది. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను మిగిలిన ఛానల్స్‌ కన్నా ఎక్కువ చూపించింది బిగ్‌టీవీనే అన్న విషయంలో రెగ్యులర్‌గా ఛానల్ చూసే వాళ్లకు అర్థమవుతుంది. బిగ్‌టీవీపై ఓ పార్టీ ముద్ర వేయాలని గత నాలుగేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇంత వరకూ సక్సెస్ కాలేదు. ఎప్పటికీ మీ కుట్రలు ఫలించవు కూడా. శాటిలైట్‌గానే కాదు.. డిజిటల్‌ రంగంలోనూ ఇప్పుడు బిగ్‌టీవీ ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్‌.

సోషల్ మీడియాలో బిగ్ కింగ్: ‘బిగ్ టీవీ’

BIG TV నెట్‌వర్క్ సోషల్ మీడియా వేదికలపై తనదైన ముద్ర వేస్తూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన YouTubeలో ఈ నెట్‌వర్క్ అత్యంత శక్తివంతంగా ఉంది. దీని ప్రధాన ఛానల్ BIGTVTeluguLive ఏకంగా 2.39 మిలియన్ల (2.39M) సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీనితో పాటు BIGTVDigital ఛానల్ 555,000 (555K) మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండగా.. @BIGTVPlus ఛానల్ 320,000 (320K) మంది ఫాలోవర్లతో దూసుకుపోతోంది.

సోషల్ మీడియా వేదికల విషయానికి వస్తే.. Facebookలో BIGTV పేజీని 432,000 (432K) మంది అనుసరిస్తున్నారు. యువత ఎక్కువగా ఉండే Instagramలో @bigtv telugu ఖాతా 411,000 (411K) మంది ఫాలోవర్లతో బలమైన ఉనికిని చాటుకుంటోంది. ఇక మైక్రోబ్లాగింగ్ సైట్ X (గతంలో Twitter) లో @BigTVTelugu ఖాతాకు 15,100 (15.1K) మంది ఫాలోవర్లు ఉన్నారు. మొత్తంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి BIG TV కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువవుతూ వార్తలను వేగంగా అందిస్తోంది.

ఇవి మాత్రమే కాదు.. యూట్యూబ్‌లో బిగ్‌టీవీ పేరుతో నడుస్తున్న మరో 20 ఛానల్స్‌కు దాదాపు 10 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. బిగ్‌టీవీ జనంలో ఎంత ఆదరణ ఉందన్నది చెప్పడానికి ఈ లెక్కలు జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. బిగ్‌టీవీపై నిందలు వేయడం కాదు.. ఛానల్ చూస్తే మేం ఎవరి పక్షాన పని చేస్తున్నామో అర్థమవుతుంది. మేం దాచేది ఏమీ లేదు.. అంతా ఓపెన్. మా ప్రసారాలన్ని యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక మలయాళంలో ప్రసారాలు ప్రారంభించకుండానే బిగ్‌టీవీ సంచలనం సృష్టిస్తోంది.

ఎక్కడచూసినా ఆ ఛానల్ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ మలయాళం చానల్ గురించే ప్రధానంగా మాట్లాడుతున్నారంటే అది మా విజయంగానే భావిస్తున్నాం. మాకో రాజకీయ పార్టీ ముద్ర వేయాలన్న మీ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. మీరెన్ని చెప్పినా, మేం ఏంటన్నది జనానికి తెలుసు. బిగ్‌టీవీను నిరంతరం చూస్తున్న వీక్షకులకు తెలుసు. కాబట్టి.. బిగ్‌టీవీని మీరు ఎంత టార్గెట్ చేస్తే మేం అంత ఎత్తుకు ఎదుగుతాం అని గుర్తుంచుకోండి.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×