Big Stories

BJP : ప్రచారంలో డీలా.. బీజేపీ స్ట్రాటజీ ఏంటి?

BJP : తెలంగాణలో అధికారంలోకి రాలేమని బీజేపీ డిసైడ్‌ అయిందా? అందుకే పెద్దగా రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టడం లేదా? కర్ణాటకలో కాషాయ దండు దండయాత్ర చేయగా.. ఇక్కడ మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అసలు కమలం పార్టీ టార్గెట్‌ అధికారంలోకి రావడమా? లేదంటే కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమేనా? అంటే రెండోదే నిజమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీలో చేరిన నేతలు తిరిగి సొంత గూటికి వెళ్లిపోతున్నా బీజేపీ పెద్దలు లైట్‌ తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం విషయంలోనూ నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంటున్నారు. పోలింగ్ కు దాదాపు రెండు వారాల గడువే ఉంది. అయినా బీజేపీ హైకమాండ్‌లో ఆ హడావుడే కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

- Advertisement -

దేశంలో ఏ మూలన ఎన్నికలు ఉన్నా బీజేపీ నేతలు మూకుమ్మడిగా దిగిపోతారు.హైకమాండ్‌ పెద్దలంతా ఒక్కసారిగా మీదపడి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు.అది బెంగాల్‌ అయినా కర్ణాటక అయినా లేదంటే కేరళ అయినా ఫార్మూలా మాత్రం ఒక్కటే. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వరుస పెట్టి ప్రచారంతో హీటెక్కిస్తారు. ఇటీవలైతే ఉత్తరప్రదేశ్‌ ఫార్మూలాను అన్ని చోట్లా ప్రయోగిస్తున్నారు. బుల్డోజర్‌ బాబా అంటూ యోగి ఆదిత్యనాథ్‌ని రంగంలోకి దింపడం పరిపారిటిగా మారింది. అలాగే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ బీజేపీ అధికారంలో ఉన్న సీఎంలు ప్రచారానికి సై అంటారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అలాంటి హడావుడి ఇంకా మొదలు పెట్టకపోవడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. అసలు రాష్ట్రంలో కమలం పరిస్థితి ఏంటో అని కన్ఫ్యూజ్‌ అవుతున్నారు. అభ్యర్థులు కూడా తాము పోటీ చేస్తున్నది గెలిచేందుకా.. లేదంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించేందుకా అని డైలమాలో పడిపోతున్నారట.

- Advertisement -

బీఆర్ఎస్‌-బీజేపీ బీ టీమ్‌ అని ఇటీవల అనేక సందర్భాల్లో క్లారిటీ వచ్చింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరారు. ఇలాంటి ముఖ్య నేతలు వెళ్లిపోయినా కమలం పార్టీ పెద్దగా స్పందించడం లేదు. తమ అసలు లక్ష్యం వేరన్నట్లుగా వ్యవహరించడం కేడర్‌ను అయోమయంలో పడేస్తోంది. ప్రచార శైలిలోనూ పెద్దల హడావుడి లేకపోవడం దేనికి సంకేతమనే ఆలోచనలో పడిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రదర్శించిన జోష్‌ తెలంగాణలో ఏమైందని బాహాటంగానే అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు.

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇక్కడే బీజేపీ లీస్ట్‌ ప్రయార్టీ దేనికి సంకేతమని సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్‌ని గెలిపించే వ్యూహాంలో భాగమని బీజేపీ శ్రేణులు క్లారిటీకి వస్తున్నారు.పైకి మాత్రం అధికారంలోకి వచ్చేది తామేనని.. బీసీని సీఎం చేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తుండగా.. అవన్నీ ఉత్తుత్తివే అనేలా ముఖ్యనేతలు చేస్తున్న కామెంట్లు కూడా బలం చేకూరుస్తున్నాయి. సీఎం అంటే ఉన్న పదవి కూడా పోతుందంటూ బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.

చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు కూడా బీజేపీ ఎలక్షన్‌ స్ట్రాటజీ ఏంటో తేలిపోయేలా చేసింది. పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకి కూడా టికెట్లు దక్కకపోవడం అనుమానాలకి తావిచ్చేలా చేసింది. అసలు ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు దక్కుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పీఠంపై చేస్తున్న ప్రకటనలు చేస్తూ కేడర్‌ని ఊత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ గెలవకుండా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్‌ కామెంట్స్‌ చేయడం ఇది ఏ రకమైన రాజకీయ ఎత్తుగడనో స్పష్టమవుతోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి సవాల్‌గా మారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌ పీఠంపై బీజేపీ కూర్చుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ అధికారంలో ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఫలితాలు కమలానికి షాక్‌ ఇచ్చాయి. ఇక తెలంగాణ సహా మిగతా చోట్లా అదే సీన్‌ రిపీట్‌ అయితే ఢిల్లీ పీఠం కదలనుందని బీజేపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ కంటే మిగతా రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్‌ కనిపించకుండా చేయడంలో భాగంగా అగ్రనేతలు ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈనెల 17న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. అదే రోజు కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానున్నారు. ఆ ఒక్కరోజే అమిత్ షా రాష్ట్ర వ్యాప్తంగా 4 బహిరంగ సభలకు హాజరుకానున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లలో పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రధాని మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్ జన గర్జన సభల్లో ప్రధాని పాల్గొంటారు. 27న హైదరాబాద్‌లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ లోపు మరికొందరు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.ఇంతకి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News