Big Stories

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

ABP C Voter Survey Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడప్పుడే గడ్డ పరిస్థితులు తీరేటట్లు లేవు. మరి కొన్ని నెలల్లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ టీమ్‌కు కష్టాలు తప్పవని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

- Advertisement -

ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెలలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశలున్నాయి. దీంతో తాజాగా ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఓపీనియన్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాలు బీఆర్ఎస్‌కు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజక వర్గాలుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి స్థానాల్లో విజయం సాధిస్తుందని, కేసీఆర్ గులాబీ పార్టీకి 3 నుంచి 5 సీట్లు మాత్రమే లభించే అవకాశాలున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ ఒపీనియన్ పోల్ సర్వేలో బిజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఎంఐఎం, కమ్యూనిస్టులు, స్వతంత్ర అభ్యర్థులకు 1 లేదా రెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. మరో విషయం లేమిటంటే కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా.

ఈ సర్వే ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడిలో పడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను పరిశీలించి వాటిని అధిగమించేకు కసరత్తు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ బీజేపీకి ఈ ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా.. జాతీయ స్థాయిలో మాత్రం మోదీ నాయకత్వంలోని బీజేపీకే మళ్లీ అధికారం దక్కే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

ABP C Voter Survey, Telangana, BRS, humiliation, Lok Sabha polls, Congress, Revanth Reddy,

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News