E-Paper
Advertisement

Sabitha Reddy: మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లు ఆడబిడ్డలు కారా..? : కొండా సురేఖపై సబిత సీరియస్

Sabitha Reddy: మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లు ఆడబిడ్డలు కారా..? : కొండా సురేఖపై సబిత సీరియస్
Advertisement

BRS MLA Sabitha Serious on Konda Surekha: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఆ వార్ వ్యక్తిగత విషయాల వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నాయకుల మధ్య రాజకీయ వార్ కొనసాగడం సాధారణం. కానీ, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం.. పైగా ఇంట్లో ఉన్న వాళ్లను రోడ్డుకు లాగుతూ విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయం సోషల్ మీడియా ట్రోలింగ్ చుట్టే కొనసాగుతున్నట్లు ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీపై, నేతలపై బీఆర్ఎస్ తన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ఘాటుగా రిప్లే ఇస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో సోషల్ మీడియా పొలిటికల్ ట్రోలింగ్ పై భారీగా చర్చ నడుస్తోంది.

సోషల్ మీడియా ట్రోలింగ్ విషయమై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి స్పందించారు. అదే సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన స్టైల్ లో కొండా సురేఖపై సీరియస్ అయ్యారు.

Advertisement

Also Read: ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్

‘సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్, బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం వాటికి ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి’ అంటూ ఆ పోస్టులో సబితా పేర్కొన్నారు.

Advertisement

‘మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరం’ అంటూ మరో పోస్టులో కొండా సురేఖపై సబిత సీరియస్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై అవమానకరంగా, దారుణంగా పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కనీసం మహిళా మంత్రి అని కూడా గౌరవించకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతారా? అంటూ ప్రశ్నించారు. కేటీఆర్.. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు లేరా.. వాళ్లకు ఈ పోస్టులు చూపించు.. అప్పుడు వాళ్లు సరే అంటే చెప్పు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆ పోస్టులను చూసి తాను ఎంతో బాధపడ్డానంటూ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే.

Also Read: కొండా సురేఖ గారు.. మీవి దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు: కేటీఆర్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఆరోపణ చేసే ముందు గతంలో మీరు మాట్లాడిన బూతు మాటలను గుర్తు చేసుకోవాలంటూ కొండా సురేఖను కేటీఆర్ హెచ్చరించారు. మీరు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు కూడా మా ఇంట్లో ఆడవాళ్లు బాధపడలేదా? అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. మీ వ్యాఖ్యలతో కేటీఆర్ ఇంటొళ్లు బాధపడరా..? వాళ్లూ ఆడబిడ్డలే కదా..?  అంటూ కొండా సురేఖపై సీరియస్ అవుతూ ఎమ్మెల్యే సబిత కూడా పై విధంగా స్పందించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×