KTR Comments on Minister Konda Surekha Over Social Media Posts: సోషల్ మీడియా విషయమై గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్టు ఢీ అంటే ఢీ అంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై అవమానకరంగా పోస్టులు పెట్టారంటూ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె కేసీఆర్, కేటీఆర్ తోపాటు హరీశ్ రావును హెచ్చరించారు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వారిపై ఆమె మండిపడ్డారు. వార్నింగ్ తోపాటు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ.
Also Read: ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్
కాగా, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. కొండా సురేఖ గారు.. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి ? అంటూ మంత్రిని ప్రశ్నించారు.
‘మా పార్టీ తరఫున ఆమెపై ఎవరూ మాట్లాడలేదు. సోషల్ మీడియాలో మాపై కూడా ట్రోలింగ్ పేరుతో దాడి జరుగుతుంది. కొండా సురేఖ గారు మీరు గతంలో ఉచ్చ ఆగడం లేదా.. ? అంటూ వ్యాఖ్యలు చేయలేదా?. అంతేకాదు.. ఆమె చాలా బూతు మాటలు మాట్లాడారు. మమ్మల్ని విమర్శించేముందు వాటిని ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. మీకు కావాలంటే గతంలో ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను మీకు పంపిస్తాను. అందులో మీరే చూడండి.. ఆమె ఏ విధంగా బూతు మాటలు మాట్లాడారో అనేది. హీరోయిన్ల ఫోన్లను మేం ట్యాప్ చేశామంటూ మాపై కొండా సురేఖ ఆరోపణలు చేయలేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా… వాళ్లు బాధపడరా..? మాపైన కూడా మీరు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు.. అప్పుడు మా ఇంట్లో మహిళలు బాధపడలేదా.. ?’ అంటూ మంత్రిపై కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: హస్తినలో ఏం జరిగింది? కూల్చివేతలపై హైకమాండ్‌కు సీఎం ఏం చెప్పారు?
‘సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే ఆయన పని. కనీసం తాను రాజకీయ నాయకుడిని అన్న ధ్యాసే లేదు సీఎం రేవంత్ రెడ్డికి. మాజీ సీఎం కేసీఆర్ పై ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. నాపై, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన నోటికి వచ్చినట్లు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. ఇటు మంత్రులు, అటు సీఎం రేవంత్ రెడ్డి.. ఇలా మాట్లాడితే ఎలా..? ప్రజాస్వామ్యంలో ఈ విధంగా వ్యవహరిస్తే ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు తెలియజేయాల్సింది ఇదేనా? సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతు మాటల వీడియోలను మీకు పంపిస్తాను. వాటిని చూసి మీరే ఏం సమాధానం చెబుతారో చెప్పండి. ఆ బూతు మాటలను విని వెంటనే మంత్రులు, కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఫినాయిల్ వేసి కడగండి’ అంటూ కేటీఆర్ పెద్ద ఎత్తున ఫైరయ్యారు.