BigTV English

Siddhique : వారం రోజులుగా పరారీలో ఉన్న నటుడు ప్రత్యక్షం… లైంగిక వేధింపుల కేసులో ఊరట

Siddhique : వారం రోజులుగా పరారీలో ఉన్న నటుడు ప్రత్యక్షం… లైంగిక వేధింపుల కేసులో ఊరట

Siddhique : అత్యాచారం కేసులో నిందితుడైన మలయాళ నటుడు సిద్ధిఖీ గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చారు. పైగా ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యంతో కాస్త ఊరట లభించడంతో మీడియాకు స్మైల్ ఇస్తూ కన్పించాడు. ఇంతకీ సిద్ధిఖీ కేసులో ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


ముందస్తు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు.. కానీ.. 

మలయాళ నటుడు సిద్ధిఖీని లైంగిక ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో అరెస్ట్ చేసేందుకు కేరళ పోలీసులు ట్రై చేశారు. కానీ అంతలోనే ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులతో దాగుడు మూతలు ఆడాడు. దీంతో అతను పరారయ్యాడు అనే వార్తలు రాగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిజానికి సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అతనికి రిలీఫ్ దొరికింది. అత్యాచారం కేసులో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. తాజాగా సుప్రీం కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందిన తరువాత అతను అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. మంగళవారం సిద్ధిఖీ ఎర్నాకులం నార్త్‌ లో ఉన్న న్యాయవాది బి రామన్ పిళ్లై & అసోసియేట్స్ ఆఫీసు బయట కనిపించాడు. సిద్ధిఖీ బయటకు రాగానే మీడియా అతడిని చుట్టుముట్టి అతను ఇన్ని రోజులూ ఎక్కడ దాక్కున్నాడు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించగా, సిద్ధిఖీ మౌనంగా తన కొడుకుతో కలిసి కారులో కూర్చొని నవ్వుతూ వెళ్ళిపోయాడు.


సుప్రీం కోర్టు నోటీసులు 
నటుడు సిద్ధిఖీకి రిలీఫ్ ఇస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వానికి, బాధితుడికి నోటీసులు జారీ చేసింది. “తిరువనంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 1192/2024కి సంబంధించి పిటిషనర్‌ని అరెస్టు చేసిన సందర్భంలో అతను ట్రయల్ కోర్టు విధించే తదుపరి శిక్షకు బాధ్యుడు” అని చెప్పిన కోర్టు కొన్ని షరతులపై సిద్దిఖీకి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. తదుపరి విచారణ తేదీలోగా దర్యాప్తు అధికారి ముందు హాజరు కావలసి ఉంటుందని, విచారణలో పాల్గొనాలనేది ఆ కండిషన్స్ లో ఒకటి.

సిద్ధిఖీపై లుకౌట్ నోటీసులు 

జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత సిద్ధిఖీ పై ఒక మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే బాధితురాలు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే సిద్ధిఖీ ఆరోపణలను ఖండించారు. ఇది ‘నేరపూరిత కుట్ర’ అని పేర్కొన్నారు. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అవుతుండగా సిద్ధిఖీ అదృశ్యం కావడంతో కేరళ పోలీసులు అతని ఫోటోతో లుకౌట్ నోటీసు జారీ చేశారు. అందులో తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×