Minister Konda Surekha Sensational Comments On KTR: టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. హీరోయిన్లకు మత్తు మందు ఇచ్చి, రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేసేవారంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలంటూ కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారని విమర్శించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని మంత్రి ధ్వజమెత్తారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి నడుపుతున్నారన్నారు.
హరీష్ రావు మనసున్న మనిషిగా కొండా సురేఖ చెప్పారు. దొంగ ఏడుపులు అవసరం లేదన్నారు. కొంతమంది హీరోయిన్ల తొందరగా పెళ్లి చేసుకొని సినీ పరిశ్రమకు దూరమయ్యారని ఆరోపించారు. నామీద ట్రోలింగ్ చేస్తే ఎవరూ రియాక్ట్ కాలేదన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ హీరోయన్లకు డ్రగ్స్ అలవాటు చేసినట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు.. హీరో హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేశారని చెప్పారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకొని వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటే ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజీయాలతోపాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: దసరా పండగకు ఊరెళ్తున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే!
ఇటీవల టాలీవుడ్‌లోనూ నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై చర్చ జరిగింది. తాజాగా, రాజకీయాల్లోనూ తెరపైకి రావడంతో మరింత ఆసక్తి నెలకొంది. కాగా, గత నెలలో నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ఈ తరుణంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.