E-Paper
Advertisement

రాహుల్‌పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు!

రాహుల్‌పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
Advertisement

KTR Remarks: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నిన్న వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారంటూ ‘రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావ్?’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, జాతీయ స్థాయి నాయకుడిని ఉద్దేశించి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలకు దిగారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

ఎమ్మెల్యే ఫిర్యాదును స్వీకరించిన సుబేదారి పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, అనుచిత పదజాలంతో దూషించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ పరిణామం అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మార్చింది. ఇప్పటికే ధరణి, రైతు రుణమాఫీ వంటి అంశాలపై ఇరు పార్టీలు కత్తులు నూరుతుండగా, ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు రాజకీయ వేడిని మరింత పెంచింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read: సిలిండర్ల బ్లాక్​ మార్కెటింగ్ ముఠా అరెస్ట్​..7.50లక్షల విలువ చేసే సిలిండర్లు సీజ్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×