E-Paper
Advertisement

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!
Advertisement

Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ పామ్ హౌస్ లోని 3 ఎకరాల బావినుండి రైతులకు నీళ్లు అందిస్తామని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ అప్పల రాష్ట్రంగా మారడానికి కారణం కేసీఆర్ నీళ్ల దోపిడేనని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి.. తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ నీళ్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దండుకొని రాజభోగం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచమంతా ఎల్ నినోతో ఇబ్బంది పడుతుంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ మాత్రం పచ్చగా కళకళలాడుతోందన్నారు. అక్కడ 58 ఎకరాల్లో చెరువు ఉందని గుర్తుచేశారు.

2016కు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఎలాంటి చెరువు లేదని ఎంపీ చామల అన్నారు. డైరెక్ట్ గా కొండ పోచమ్మ నుండి జగదేవ్ పూర్ కెనాల్ కు అక్కడ నుండి పాండు రంగా చెరువు కు నీళ్లు పోతున్నాయని పేర్కొన్నారు. ఆపై పాండు రంగా చెరువు నుండి కేసీఆర్ పామ్ హౌస్ నీళ్లు వెళ్తున్నాయని చామల ఆరోపించారు. కేసీఆర్ కు తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదన్న ఎంపీ.. కేవలం తన పామ్ హౌస్ కు నీళ్లు వస్తే చాలని ప్లాన్ చేసుకున్నారని మండిపడ్డారు. తాను కాళేశ్వరం కట్టి, కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Also Read: పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

మరోవైపు ఎల్ నినో, నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ఎంపీ చామల అన్నారు. తెలంగాణ అనగానే గుర్తుకు వచ్చేది నీళ్లు, నిధులు నియామకాలేనని చెప్పారు. అయితే నీళ్లు కేసీఆర్ పామ్ హౌస్ కు, నియామకాల్లో భాగంగా మంత్రి పదవి కేటీఆర్ కు.. నిధిలు కల్వకుంట్ల కుటుంబానికి వచ్చాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మిగులు రాష్ట్రానికి సీఎం అయితే.. వారు దోచేసిన అప్పుల రాష్ట్రానికి ప్రస్తుతం రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.

Advertisement

Also Read: 19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

Tags

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×