E-Paper
Advertisement

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!
Advertisement

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అగ్గి రాజేస్తున్నాయి. రెండో రోజు నామినేషన్స్ సందర్భంగా పల్నాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బయటకు రాకుండా ఇంటి వద్దనే నిర్భందం చేశారు. అటు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని సైతం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ చర్యలకు ఉపక్రమించినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా ఇవాళ గురజాల, మాచర్లలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటుచేసుకునే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. గత అనుభవాలతో పాటు నామినేషన్స్ తొలి రోజున పుంగనూరులో చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని పల్నాడు పోలీసులు ఈ హౌస్ అరెస్టులు చేసినట్లు సమాచారం. కాగా, నామినేషన్ల వేళ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Also Read: ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

హౌస్ అరెస్టుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురజాల నియోజకవర్గంలో పోలీసులను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారని ఆరోపించారు. పోలీసులు రౌడీల్లా మారి.. వైసీపీ అభ్యర్థులను అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దాచేపల్లిలో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిని అరెస్టు చేశారని.. రాత్రి గురజాల ఛైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డిని నిర్భందించారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, పోలీసుల చర్యలపై కోర్టులో పోరాడతామని కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

స్థానిక సంస్థల తొలిరోజు నామినేషన్ల సందర్భంగా ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా పుంగనూరు రణరంగాన్ని తలపించింది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా.. ఘర్షణ తలెత్తింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

Also Read: అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Tags

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

Big Stories

Advertisement
×