E-Paper
Advertisement

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!
Advertisement

మహిళా రిజర్వేషన్ల అమలు.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన! ఈ రెండు కీలక అంశాలపై మరోసారి పార్లమెంట్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందన్న వార్తలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మోదీ సర్కార్‌ ప్రధాన లక్ష్యం. అయితే నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చనే అభ్యంతరాలు,ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Advertisement

ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రతిపాదనతోపాటు, దానికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లులపై ముందడుగు పడలేదు. ఇప్పుడు మరోసారి ఈ బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.ఆ రెండు బిల్లుల ఆమోదం కోసం ఈ నెలాఖరులో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే ఉభయ సభల్లోనూ టూ-థర్డ్స్ మెజారిటీ చాలా ముఖ్యం. ప్రస్తుతం సభలో ఎన్డీఏకి మెజారిటీ ఉన్నప్పటికీ.. ఆ మ్యాజిక్ ఫిగర్ 360 సీట్లు మాత్రం ఇంకా రాలేదు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన యూబీటీ నుంచి ఆరుగురు ఎంపీలు అధికార పక్షం వైపు వచ్చేయడం ప్రభుత్వానికి కలిసి వచ్చింది.

Advertisement

తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న డీఎంకే నుంచి 22 ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎంకేతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతోనూ టచ్‌లో ఉన్నారు. మరోవైపు, సీట్లను అడ్డగోలుగా కాకుండా 50 శాతం గ్యారెంటీగా పెంచుతామని హామీ ఇస్తే మద్దతు ఇచ్చేందుకు NCP (SP) కూడా సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. మొత్తానికి విపక్షాల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, ఈసారైనా ఈ కీలక బిల్లులను పాస్ చేయించుకోవాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది.

Also Read: 19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే. డీలిమిటేషన్‌, మహిళల రిజర్వేషన్ల బిల్లులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి.. పార్టీలకు తగిన సమయం ఇవ్వాలని ఖర్గే లేఖలో కోరారు. బలవంతంగా బిల్లులను పాస్ చేయించే ప్రయత్నం చేయొద్దని ప్రధాని మోదీకి సూచించారు ఖర్గే.

Tags

Related News

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

Big Stories

Advertisement
×