E-Paper
Advertisement

వెదర్ అప్‌డేట్స్.. తెలంగాణలో 18 జిల్లాలకు అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు

వెదర్ అప్‌డేట్స్.. తెలంగాణలో 18 జిల్లాలకు అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు
Advertisement

Telangana Weather Updates: అసలే సమ్మర్ సీజన్.. బయటకు వెళ్లాలంటే ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వాతావరణం చల్లబడడంతో ఉక్కుపోత చంపేస్తోంది. ఫ్యాన్ వేసుకుంటే వేడిగా గాలి వస్తోంది. తాజాగా తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్. 18 జిల్లాల్లో బుధవారం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో 18 జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంది. రాత్రయితే చాలా కాసింత చల్లగా ఉంటోంది. వేడి అమాంతంగా తగ్గిపోతుంది. వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Advertisement

సాయంత్రం అయితే చాలు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో నిండిపోతోంది. కొన్నిప్రాంతాల్లో చిరు జల్లులు, మరొక ప్రాంతంలో భారీ వర్షం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్ చెప్పింది వాతావరణ శాఖ. 18 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉరుములు, మెరుపుతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం

Advertisement

బుధవారం నాడు తెలంగాణలో 18 జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత్  వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇక హైదరాబాద్ సిటీ వాతావరణం విషయానికి వద్దాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. అయితే పగటి వేళ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య ఉంటుందని వాతావరణ అంచనా.

ALSO READ: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకు చేరిన బస్సులు, ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×