E-Paper
Advertisement

Peddi Movie : 3 నిముషాల సీన్ కోసం మూడు నెలలు.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే సీన్..!

Peddi Movie : 3 నిముషాల సీన్ కోసం మూడు నెలలు.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే సీన్..!
Advertisement

Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 30 న విడుదల అవ్వాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత బెటర్ గా ఉండడం కోసం కాస్త సమయాన్ని తీసుకున్నారు. దీంతో ఈ మూవీ జూన్ నెలకు వాయిదా పడింది. మరో 6 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కేవలం ఒక్క సీను కోసం దాదాపు మూడు నెలలు రామ్ చరణ్ కష్టపడినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ సూపర్ సీన్ ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఒక్క సీన్ కోసం 3 నెలలు..

పెద్ది మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పహిల్వాన్ టీజర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఆ సీను మాత్రం మెగా ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది అని చెప్పాలి. ఆ టీజర్ వీడియో క్షణాల్లో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీక్వెన్స్ సినిమాలో 3 నిమిషాల వరకు ఉంటుందట.. ఏపీ రాష్ట్రం తరఫునుంచి హీరో రామ్ చరణ్ కుస్తీ పోటీల్లో పాల్గొంటాడట.. రాజస్థాన్ కుస్తీ పోటీదారులతో పోటీ పడబోతున్నాడు అట. ఈ సీక్వెన్స్ మొత్తం అద్భుతంగా వచ్చిందని, థియేటర్స్ లో చూసే వాళ్లకు గూస్ బంప్స్ పక్కా అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ సీన్ కోసం ఎంత కష్టపడ్డాడో అంతకు మించి వీఎఫ్క్స్ కంపెనీ కూడా బాగా కష్టపడిందట. ఈ సీన్ పూర్తి చెయ్యడానికి దాదాపుగా 3 నెలల సమయం పట్టిందని టాక్.. కేవలం ఒక్క సీన్కే అంత టైం పడితే సినిమాకి ఇంకెంత టైం పట్టిందో అని ప్రస్తుతం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఆ లుక్ లో మాత్రం రామ్ చరణ్ అదిరిపోయాడని చెప్పాలి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు ఇదే హైలెట్ సీన్..

Advertisement

Also Read : చిరు-చెర్రీ కాంబోలో మూవీ.. రిస్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..?

పెద్ది షూటింగ్ అప్డేట్.. 

రామ్ చరణ్, జాన్వి కపూర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని మెగా అభిమానులు అలాగే సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలకి విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం వనస్థలిపురంలో జరగనుంది. టాకీ పార్ట్అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తుంది. మృణాల్ ఠాకూర్, రామ్ చరణ్ కాంబోలో ఈ సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ సాంగ్ పూర్తవుగానే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉండడంతో ఈసారి బ్లాక్ బస్టర్ హీట్ పక్కా అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి రాంచరణ్ పెద్ది మూవీతో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×