E-Paper
Advertisement

Congress Leaders Fires on Harishrao: రాజీనామా పేరుతో హరీశ్ రావు డ్రామా: కాంగ్రెస్ నేతలు

Congress Leaders Fires on Harishrao: రాజీనామా పేరుతో హరీశ్ రావు డ్రామా: కాంగ్రెస్ నేతలు
Advertisement

Congress Leaders Fires on MLA Harishrao: రాజీనామా పేరుతో మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డ్రామా చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను మూసివేయాలని సీఎం రేవంత్ సవాల్ విసిరారు కానీ, దానిపై హరీశ్ రావు స్పందించకుండా తన రాజీనామా లేఖలో సవాలక్ష కండీషన్లను రాసుకొచ్చారని కాంగ్రెస్ నేతలు అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదని.. ఇలాంటి రాజీనామాలకు విలువ ఉంటుందా అని ప్రశ్నించారు. అసలు సభా వ్యవహారాలు చూసిన హరీశ్ రావుకు ఆ మాత్రం కూడా తెలియదా అంటూ విమర్శించారు.

అయితే, గన్ పార్క్ వద్దకు హరీశ్ రావు రాజీనామా లేఖతో చేరుకోనున్నారు. హరీశ్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ పేర్కొన్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సాక్షిగా తన రాజీనామా లేఖను మేధావుల చేతిలో పెడుతున్నానని తెలిపారు. రైతుల విషయంలో తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

ఈ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయకుండా తనకు నచ్చిన కండీషన్లను రాసుకొచ్చి.. ఇదే రాజీనామా లేఖ అంటున్నాడని ఫైర్ అయ్యారు. అయితే, అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగిన విషయం తెలిసిందే.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×