Big Stories

CM Revanth Reddy: బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ.. నమో అంటే నమ్మించి మోసం చేయడం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy speech today(Telangana politics): రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆరెస్సెస్ విధానాలను అమలు చేస్తూ.. కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుందని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాజేంద్రనగర్‌లో వచ్చిన జనసందోహాన్ని చూస్తోంటే చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.

- Advertisement -

‘పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ.. ఇచ్చింది కేవలం 7లక్షలు మాత్రమే. రైతులకు ఆదాయం రెట్టింపు పేరుతో నిలువెల్లా బీజేపీ మోసం చేసింది. జన్ ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ.. పదేళ్లయినా 15 పైసలు కూడా వేయలేదు. బీజేపీ వాళ్లు నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.

బీసీ జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే బీజేపీ భయపడి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుంది. బీజేపీ ఆరెస్సెస్ విధానాలను అమలు చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది’ అంటూ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

‘వ్యాపారం ముసుగులో బ్రిటీషర్లు ఇండియాను ఆక్రమించుకున్నారు. సూరత్ నుంచే బ్రిటిష్ ఆక్రమణ మొదలైంది. బీజేపీ ఈస్టిండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ల ఎజెండా బ్రిటిష్ ఎజెండా.. వాళ్ల ఎజెండా రిజర్వేషన్లు రద్దు చేయడం. కాంగ్రెస్ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం.. రిజర్వేషన్లు అమలు చేయడం’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వెల్లడించారు.

‘పదేళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారు. కార్ఖానాకు వెళ్లిన కారు ఇక సరాసరి తూకానికే. కారు పనైపోయిందని ఇవాళ కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారు. కేసీఆర్ బస్సు యాత్ర వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుంది. నాలుగు గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కేసీఆర్ ఊరూరు తిరిగినా.. ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కున్నా.. తెలంగాణ సమాజం ఆయన్ను నమ్మదు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అందరి అభిప్రాయాలతోనే చేవెళ్లలో రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని సీఎం వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తీసుకురావాలన్నారు. వాటికోసం పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చేవెళ్ల అభివృద్ధి జరగాలంటే రంజిత్ రెడ్డిని పార్లమెంట్ కు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.

Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మాయం: సీఎం రేవంత్

బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని అన్నారు. బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని వెల్లడించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా చెబుతున్నారని.. దీనిపై విశ్వేశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉందని.. దాన్ని కలుషితం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News