Big Stories

Verdict on Streedhan : భార్య స్త్రీధనం భర్త వాడుకుంటే.. దానిని తిరిగి ఇచ్చేయాలి : సుప్రీంకోర్టు

Supremecourt Verdict on Streedhan : భర్త తన అవసరానికి భార్య స్త్రీధనాన్ని వాడుకుంటే.. దానిని తిరిగి ఆమెకు ఇచ్చేయాలని, స్త్రీ ధనంపై పూర్తి హక్కు మహిళలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేరళకు చెందిన మహిళకు 2009లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఆ సమయంలో ఆమె కుటుంబం ఆమెకు 89 బంగారు నాణేలు, భర్తకు రూ.2 లక్షల విలువైన చెక్కును ఇచ్చింది.

- Advertisement -

మరునాడు ఆమె అత్తారింటికి వెళ్లాక.. ఆ బంగారు నాణేలను తాను భద్రంగా దాచిపెడతానని నమ్మించి తీసుకుని.. వాటిని తన తల్లికి ఇచ్చాడు. కొన్నాళ్లకు తన అప్పులు తీర్చుకునేందుకు వాటిని అమ్మేశాడు. కొద్దిరోజులకు విషయం తెలుసుకున్న భార్య.. తన నాణేలు తనకి ఇవ్వాలని అడిగింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగ్గా.. తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కోర్టు మెట్లెక్కింది.

- Advertisement -

Also Read : సుప్రీం సంచలన తీర్పు.. 30 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి..!

కేరళ హై కోర్టు ఆమె పిటిషన్ పై విచారణ చేసినా.. తన బంగారు నాణేలను భర్త, అత్త వాడుకున్నారనేందుకు సరైన ఆధారాలు చూపలేకపోవడంతో నిరాశ ఎదురైంది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. 2009లో 89 గోల్డ్ కాయిన్స్ ధర రూ.8.90 లక్షలు ఉండగా.. ఆ నాటి నుంచి ఈనాటి వరకూ పరిహారంతో కలిపి భార్యకు రూ.25 లక్షలు చెల్లించాలని, ఆరునెలల్లోగా ఇది జరగాలని తీర్పు వెలువరించింది. స్త్రీధనం పూర్తిగా మహిళలకు చెందిన ఆస్తి అని, దానిపై భర్తకు నియంత్రించే హక్కు ఉండదని పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News