E-Paper
Advertisement

హరీష్‌రావు ఢిల్లీ టూర్..బీఆర్ఎస్‌లో ముసలం, ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

హరీష్‌రావు ఢిల్లీ టూర్..బీఆర్ఎస్‌లో ముసలం, ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

Telangana politics: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు జగిత్యాల బహిరంగ సభ ఉండగా హరీష్‌రావు ఢిల్లీ వెళ్లారు? కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా ఆ పార్టీలో ముసలం మొదలైందా? జీవన్‌రెడ్డి రాక హరీష్‌రావు ఇష్టం లేదా? అందుకే హస్తిన పేరిట టూర్‌కి వెళ్లారా? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.

ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

జీవన్‌రెడ్డి కారు పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. ఈ సభకు పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా హాజరవుతున్నాయి. అదే సమయంలో హరీష్‌రావు ఢిల్లీ వెళ్లడం పార్టీ నేతల్లో కలకలం రేపింది. ఉన్నట్లుండి ఎందుకు హరీష్ ఢిల్లీ వెళ్లారంటూ చర్చించుకోవడం మొదలైంది.

దీనిపై మూడు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాళేశ్వరం కమిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆయన వెళ్లారా? దీనికి మరొక రోజు కేటాయించవచ్చని, ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రత్యర్థుల నుంచి కామెంట్స్ పడిపోతున్నాయి.

Advertisement

బీఆర్ఎస్‌లో ముసలం.. అందుకే హరీష్‌రావు ఢిల్లీ టూర్

అదే సమయంలో మరొక కొత్త డౌట్ పుట్టుకొచ్చింది. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చేందుకు వెళ్లారన్నది ఆ పార్టీలో కొందరు నేతల మాట. ఎందుకంటే ఈనెల 25న కవిత పార్టీ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరుపై క్లారిటీ తెచ్చేందుకు ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి అవకాశముందని అంటున్నారు.

బీజేపీలో చేరేందుకు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారన్నది ప్రత్యర్థి పార్టీల నుంచి బలంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని ఆరోపించారు. జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు.

ALSO READ: కేసీఆర్ స‌భ‌.. రేవంత్ ప‌ర్య‌ట‌న‌… మ‌ధ్య‌లో కాళేశ్వ‌రంపై క‌విత పంచులు!

జీవన్‌రెడ్డిని ఎప్పుడూ హరీష్‌రావు పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. కేటీఆర్.. జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్‌రావు వెళ్ళలేదని గుర్తు చేశారు. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుంటే హరీష్‌రావు ఢిల్లీ వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన ఎవర్ని కలిసి మాట్లాడుతారు అనేది త్వరలో బయటకు వస్తుందన్నారు.

హరీష్‌రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేవి ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ లాంటిదని, ఆ పార్టీలో చేరడంవల్ల లాభం కంటే నష్టం ఎక్కువన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవన్‌రెడ్డికి సముచిత స్థానం ఇచ్చిందన్నారు.

 

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×