E-Paper
Advertisement

రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ కొత్త పద్ధతి.. ఏం టాలెంట్ గురూ!

రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ కొత్త పద్ధతి.. ఏం టాలెంట్ గురూ!
Advertisement

Allu Arjun:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగా మేనల్లుడిగా అడుగుపెట్టి.. నేడు తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం అట్లీ (Atlee) దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

వేతనంతో పాటు ఆదాయం కూడా..

పైగా ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాల పెంచేసిన విషయం తెలిసిందే. ఒకవైపు తన సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరొకవైపు రెమ్యూనరేషన్ విషయంలో కొత్త పంథా తొక్కినట్లు తెలుస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇతర హీరోలకి ఆదర్శంగా నిలుస్తోందనే చెప్పాలి. అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిరమైన వేతనం మాత్రమే కాకుండా సినిమా సంపాదించే ప్రతి రూపాయిలో కూడా 30 పైసల వాటా తీసుకునే పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ నిర్ణయం.. నిర్మాతకు ఆదాయం..

Advertisement

దీనివల్ల నిర్మాతపై భారం తగ్గడమే కాకుండా సినిమా సక్సెస్ లో నటుడిని కూడా భాగస్వామిని చేస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే పుష్ప 2 సినిమా రూ.1,742 కోట్ల వసూళ్లలో అల్లు అర్జున్ కి సుమారుగా రూ.522 కోట్లు లభించినట్లు సమాచారం. ఇక ఇండియన్ సినిమాలో ఇదో ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పద్ధతిని అల్లు అర్జున్ రాకా సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి రాకాకి గనుక సక్సెస్ లభించి..సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే మాత్రం బన్నీకి తన రెమ్యూనరేషన్ తోపాటు ఆదాయం కూడా అదనంగా లభిస్తుంది.

ALSO READ:గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి, సోనుసూద్.. ఆర్థిక సహాయంతో పాటు ప్రాణదానం కూడా!

ఫ్యామిలీతో ముంబైకి షిఫ్ట్ అవుతున్న బన్నీ..

Advertisement

మరొకవైపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదు నుండి ముంబైకి వెళ్లి రావడానికి ఎక్కువ సమయం.. పైగా శారీరక శ్రమ.. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కఠినమైన షూటింగ్ షెడ్యూల్ నిర్వహించడానికి చక్కటి అవకాశం దొరుకుతుంది. ఇకపై రెండు నగరాల మధ్య నిరంతర ప్రయాణాన్ని తగ్గించుకోవచ్చని.. మరింత సమయాన్ని సినిమాకు కేటాయించవచ్చని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నారట. మరో రెండు మూడు సంవత్సరాల పాటు అల్లు అర్జున్ ముంబైలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×