E-Paper
Advertisement

బీ కేర్ ఫుల్!.. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. సైబరాబాద్‌ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్!

బీ కేర్ ఫుల్!.. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. సైబరాబాద్‌ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Cyberabad Commissioner: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి విభాగంలోని అధికారులు మొదలుకుని, కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో తెలుసునని, నిబద్ధతతో అంకితాభావంతో విధులు నిర్వర్తించేలా తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్చలు తప్పవని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ జి. సృజన హెచ్చరించారు. శనివారం కమిషనర్ అన్ని విభాగాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల విషయంలో ప్రజలను ఆఫీసు చుట్టూ తిప్పుకోవటం, కొన్ని సందర్భాల్లో అమ్యామ్యాలకు కూడా ఆశపడుతున్నట్లు సమాచారముందని, అలాంటి వారు తమ పద్దతిని వెంటనే మార్చుకోవాలని కమిషనర్ సూచించారు.

పెండింగ్ కోర్టు కేసులపై సమీక్ష..

Advertisement

కమిషనర్ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్, చీఫ్ సిటీ ప్లానర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్), డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతులు, సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల ప్రాధాన్యతలు, పెండింగ్ ఫిర్యాదులు, కొనసాగుతున్న, ప్రతిపాదిత అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, అలాగే కీలక పరిపాలనా అంశాలపై సమీక్ష నిర్వహించి, కమిషనర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తమ పనితీరులో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉందని సూచించారు. పెండింగ్ ఫిర్యాదులు, బిల్డ్ నౌ దరఖాస్తులు, భూసేకరణ, వాక్ కార్యక్రమం, పెండింగ్ కోర్టు కేసులపై సమీక్షించారు.

నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి..

Advertisement

దరఖాస్తులు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, కోర్టు కేసుల పరిష్కారానికి సంబంధిత అధికారులు స్టాండింగ్ కౌన్సిల్‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మంజూరైనా, ప్రతిపాదన దశలో ఉన్న పనుల పురోగతి, పార్కుల అభివృద్ధి, జంక్షన్ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌లు, ప్రజా సౌకర్యాలు, వీధి దీపాల పనులను సమీక్షించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాలను పాటించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూసీడీ వింగ్ లో కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, బ్యాంకు రుణ అనుసంధానం, పీఎం స్వనిధి అమలుతో పాటు జీవనోపాధి కార్యక్రమాల పురోగతిని కూడా కమిషనర్ సమీక్షించారు. పట్టణ జీవవైవిధ్యం, ఆస్తుల నిర్వహణ విభాగం సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల హాజరు, వాహనాల హాజరు, నో బిన్ – నో ట్రేడ్ కార్యక్రమం, పోస్టర్-రహిత నగర ప్రచారం, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యకలాపాల పురోగతి వివరాలపై అధికారులను ఆరా తీశారు.

అధికారులకు స్పష్టమైనా ఆదేశాలు..

దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ చర్యలు, ప్రజారోగ్య కార్యక్రమాలను సమీక్షించి, నివారణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. కొత్త ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలు ప్రక్రియ, నీటి కలుపు మొక్కల తొలగింపు పనులను సమీక్షించి, సంబంధిత అధికారులు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అడ్వర్ టైజ్ మెంట్ల నిర్వహణ, ఐటీ సంబంధిత సమస్యలు, జనగణన కార్యకలాపాలను సమీక్షించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు తమ శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులు, కార్యకలాపాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని, పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించాలని కమిషనర్ ఆదేశించారు. మంజూరైన పనులు, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం.. జమ్మికకుంట, ములుగుల్లో అరెస్టులు!

Tags

Related News

కాసానికి లైన్ క్లియర్! బీసీ కార్డ్‌తో ఎమ్మెల్సీ బరిలోకి గులాబీ పార్టీ?

హైదరాబాద్ లో టెక్కీ ఆత్మహత్య.. ఉదయం ఆఫీసు.. రాత్రికి ఇంట్లో ఉరి, మృతురాలు సొంతూరు..

రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం.. జమ్మికకుంట, ములుగుల్లో అరెస్టులు!

ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!

పనిచేయనప్పుడు పదవులెందుకు.. బీజేపీ నేతలకు బన్సల్ వార్నింగ్?

తెలంగాణను గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్‌ వేలు కొరికి.. నడిరోడ్డుపై బట్టలిప్పేసి.. ర్యాపిడో డ్రైవర్ నానా హంగామా!

Big Stories

Advertisement
×