Hyderabad Techie Suicide: కారణాలు ఏంటో తెలీదు.. ఉదయం ఆఫీసులో ఉద్యోగం చేసింది ఓ టెక్కీ. సాయంత్రం ఇంటికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇంతకీ మృతురాలు సొంతూరు ఎక్కడ? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
దేశవ్యాప్తంగా టెక్కీల ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. వారంలో నాలుగైదు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. జీతం చాలక కొందరు, అంతర్గత సమస్యలు మరికొందరు, ఇంకొందరు రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ టెక్కీ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. మాదాపూర్ మైండ్ స్పేస్‌లోని ఐటీ కంపెనీలో టెక్కీ పని చేస్తోంది 29 అర్చన. ఆమె పూర్తి అర్చన చౌదరి మాలిక్.
సొంతూరు ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో ఉంటోంది. అక్కడ ఓ ఇంటికి అద్దెకు తీసుకుంది మహిళా టెక్కీ. శుక్రవారం ఉదయం ఆఫీసుకి వెళ్లిందని సమాచారం. సాయంత్రం రూమ్‌కి వచ్చిన తర్వాత ఏ జరిగిందో తెలీదు. ఆ రాత్రికి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. శనివారం ఎంతకూ డోర్ ఓపెన్ కాకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్లు ఓనర్‌కు సమాచారం ఇచ్చారు. ఓనర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు సమాచారం ఇచ్చారు. వారి వచ్చిన తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.
ALSO READ: రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం.. జమ్మికకుంట, ములుగుల్లో అరెస్టులు!
రూమ్‌లో లభించిన ఆధారాలతో మృతురాలు యూపీకి చెందిన మహిళగా గుర్తించారు. లభించిన ఆధారాలతో వారి బంధువులకు ఫోన్ లో సమాచారం ఇచ్చారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అసలు అర్చన ఉరేసుకునేందుకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో వెయిట్ అండ్ సీ.