E-Paper
Advertisement

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller Movie: నడి సముద్రంలో చేపల వేటకో లేదా ప్రయాణానికో వెళ్లినప్పుడు అకస్మాత్తుగా వాతావరణం మారిపోతే ఎలా ఉంటుంది ? చుట్టూ అంతులేని నీరు, పై నుంచి ఊహించని వేగంతో దూసుకొచ్చే పెను తుఫాను మిమ్మల్ని చుట్టుముడితే బతకడం అసాధ్యం. అలాంటి ఒక డేంజరస్, కేటగిరీ 5 హరికేన్ తుఫాన్‌ లో సముద్ర మధ్యలో చిక్కుకున్న ఇద్దరు అన్నదమ్ముల రియల్ సర్వైవల్ జర్నీయే ఈ ‘సర్వైవింగ్ హరికేన్ ఓటిస్’ (Surviving Hurricane Otis). ప్రకృతి ప్రకోపానికి, మనిషి బతకాలనే పట్టుదలకు మధ్య జరిగే ఈ సర్వైవల్ డ్రామా ఆడియన్స్‌ ను కంప్లీట్‌గా సీట్ ఎడ్జ్‌ లో కూర్చోబెడుతుంది. మరి ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడాలి ? అనే విషయాన్ని తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

విర్పుల్, కాండీ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరి మధ్య పర్సనల్‌ గా కొన్ని మనస్పర్థలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒక సాధారణమైన రోజున వాళ్ళు సముద్రంలో బోటుపై వెళ్తున్నప్పుడు సడెన్‌ గా వెదర్ కండిషన్స్ పూర్తిగా మారిపోతాయి. మెక్సికోలోని అకాపుల్కో తీర ప్రాంతాన్ని తాకబోయే ‘హరికేన్ ఓటిస్’ తుఫాను ఊహించిన దానికంటే చాలా వేగంగా, అత్యంత భయంకరంగా విరుచుకుపడుతుంది. మొదట చిన్నపాటి గాలి వాన అనుకుంటారు, కానీ ఆ తర్వాత అలల ఎత్తు పెరిగి బోటు బోల్తా పడే పరిస్థితి వస్తుంది. చుట్టూ చీకటి, చెవులు హోరెత్తించే గాలుల హోరు మధ్య వాళ్ళిద్దరూ ఆ సముద్రంలో ఒంటరిగా మిగిలిపోతారు. ఒడ్డుకు చేరుకోవడానికి ఎలాంటి దారి దొరకదు.

Advertisement

బోటు మునిగిపోతున్న ఆపద సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడే పాట్లు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఈ పెను తుఫాను గండం నుంచి బయటపడే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న పాత గొడవలు, మనస్పర్థలు అన్నీ మాయమైపోతాయి. ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి వాళ్ళు చూపించే బాండింగ్, చావుకు ఎదురు నిలిచి చేసే పోరాటం సినిమాను ఎమోషనల్‌ గా టచ్ చేస్తుంది. మరి ఆ తుఫాను రాక్షసి నుంచి ఈ అన్నదమ్ములు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు ? నడి సంద్రంలో ఆ గండం నుంచి ఎలా గట్టెక్కారు ? అన్నది తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘సర్వైవింగ్ హరికేన్ ఓటిస్’ సర్వైవల్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ స్పానిష్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ లాంటి మేజర్ లాంగ్వేజెస్ ఆడియోస్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. జార్జ్ మైఖేల్ గ్రావ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మెక్సికన్ సర్వైవల్ డ్రామాలో బెన్నీ ఇమ్మాన్యుయేల్, క్రిస్ట్యాన్ ఫెర్రర్ అద్భుతంగా నటించారు. సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు. సముద్రంలో నుంచి ఆ బ్రదర్స్ ఇద్దరూ బయట పడే వరకూ ఒక్కో సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఈ వారం గుర్తుండిపోయే ఒక మంచి మూవీ కావాలంటే ఇదే సూపర్ ఆప్షన్.

Advertisement

Read Also: పోలీసులు జైల్లోనే కొట్టి చంపేస్తే… సీజన్‌ 2తో వచ్చేసిన క్రేజీ క్రైమ్‌ థ్రిల్లర్‌

Tags

Related News

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

Big Stories

Advertisement
×