E-Paper
Advertisement

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!
Advertisement

El Niño Crisis: స్వేచ్చ బ్యూరో: ‘ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. పాలకుల అనాలోచిత విధానాలు, పరిపాలనా వైఫల్యంతో తెచ్చిపెట్టిన మానవ నిర్మిత సంక్షోభం’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కరువు కేబినెట్ ఉపసంఘానికి, సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఎల్ నినో సంక్షోభంపై 23 ప్రశ్నలు సందించారు. ఏప్రిల్‌లోనే ఐఎండీ హెచ్చరించినా పట్టించుకోకుండా, వర్షాకాలం ముగిసి పంటలు ఎండిపోయాక అక్టోబర్‌లో ఉపసంఘం వేస్తారా?కనీస టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, నిర్దిష్ట గడువు, బడ్జెట్ నిధులు కేటాయించని జీవో 1523 ఉపసంఘం మరో కాలయాపన డ్రామా మాత్రమే అన్నారు.

కోటి రూపాయలు విదిలిస్తారా?

కన్నెపల్లి పంపులు నడపకుండా 1,000 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను సముద్రం పాలు చేసి రైతుల నోట్లో మన్నుకొట్టారని, కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డ నెపంతో కాళేశ్వరం నీటిని ఎత్తకుండా తెలంగాణను ఎండబెడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర తాగునీటి ముప్పు పొంచి ఉంటే, ఒక్కో జిల్లాకు కేవలం కోటి రూపాయలు విదిలిస్తారా? హైదరాబాద్‌లో 3 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి కొరత పొంచి ఉన్నా, ఉపసంఘంలో పురపాలక శాఖకు స్థానం ఎందుకు కల్పించలేదు? రికార్డు స్థాయిలో 20,003 మెగావాట్ల డిమాండ్ ఉంటే, యూనిట్‌కు రూ.9.41 చొప్పున రోజుకు రూ.43 కోట్లు పోసి బహిరంగ మార్కెట్లో కొంటున్నారని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కేవలం 5 రోజులకే సరిపడా బొగ్గు నిల్వలు.. విద్యుత్ నిర్వహణలో పాలకుల చేతగానితనం అని, 10 లక్షల ఎకరాల పంటలు దెబ్బతినే ముప్పు ఉన్నా, ఇప్పటివరకు కరువు మండలాల అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదు? అని నిలదీశారు.

ఎందుకు కేటాయించలేదు?

Advertisement

ఎల్ నినోను ‘కోవిడ్ లాంటి విపత్తు’ అన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర సొంత ఖజానా నుండి అత్యవసర సహాయ నిధిని ఎందుకు కేటాయించలేదు? ఎల్ నినో సంక్షోభం, కరువు నివారణపై చర్చించేందుకు వెంటనే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి అసెంబ్లీలో ప్రత్యేక అత్యవసర అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఉపసంఘం తొలి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించేలా జీవోను సవరించి, ఆ మినిట్స్, సిఫార్సులను శాసనసభ సాక్షిగా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

Also read: కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

Tags

Related News

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత

రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు.. మంత్రి క్లారటీ!

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

Big Stories

Advertisement
×