E-Paper
Advertisement

Telangana bonalu: బోనాన్ని కోడితో ప్రారంభించిన భక్తుడు, వైరల్ ఫొటోలు

Telangana bonalu: బోనాన్ని కోడితో ప్రారంభించిన భక్తుడు, వైరల్ ఫొటోలు
Advertisement

Devotee Who Started Telangana Bonam With Chicken, Viral Photos: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఊళ్లలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ పండుగను కుటుంబసమేతంగా అందరితో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు గ్రామస్థులు. అయితే నూతనంగా మహబూబాబాద్ జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా పరిధిలోని కేసముద్రం మండలం ఉంది. అన్ని ఊళ్లలో జరుగుతున్నట్టుగానే ఈ మండల కేంద్రంలో బోనాలు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

అయితే ఇక్కడ జరుగుతున్న బోనం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బోనాల పండుగలో పుంజుకు పట్టిన పుత్తడి వైభవం తీసుకొచ్చాడు అదే గ్రామానికి చెందిన వ్యక్తి. అంతేకాదు గత 6 ఏళ్లుగా బోనంతో పాటు కోడి మొక్కును అమ్మవారికి కేసముద్రం గ్రామానికి చెందిన తొడేటి వెంకన్న ప్రతి ఏటా చెల్లించుకుంటున్నాడు. నాటు కోడికి బంగారు చెవి కమ్మలు చేపించి, దానికి మందు సీసా,నిమ్మకాయలు కట్టి డప్పు చప్పుళ్ళతో ఊరంతా ర్యాలీ నిర్వహిస్తాడు. దీంతో దీనిని చూసేందుకు కోడి చుట్టూ కుర్రకారు చేరి సెల్ఫీలు దిగుతున్నారు. మరికొందరు అయితే తోడేటి వెంకన్నను తారీఫ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…

ఇక వెంకన్న తయారుచేసిన కోడిని చూసేందుకు చుట్టుపక్కల జనాలు కేసముద్రంకు తండోపతండాలుగా ఆ గ్రామానికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ గ్రామానికి చెందిన వెంకన్న ఆ కోడిని ప్రతి ఏడాది ఇలాగే తయారుచేస్తారంటూ ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇక ఈ కోడి చెవులకు కమ్మలు మెడలో మందు బాటిల్, మెడలో బంతిపూల దండతో అందరిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన న్యూస్ కాస్త నెట్టింట వైరల్ కావడంతో ఈ న్యూస్ చూసిన నెటిజన్లు ప్రతిఒక్కరు వావ్ భలే కోడి అంటూ కొందరు, మరికొందరు ఫన్నీ కామెంట్లతో పోస్ట్‌లు పెడుతున్నారు. ఏదేమైనా తెలంగాణ అంతటా ఈ న్యూస్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Tags

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×