BigTV English

Khammam: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…

Khammam: ప్రాణం తీసిన ఫోన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే…

The Phone That Took Life, If You Know Why, You Will Be Shocked: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అందరూ మారాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఫోన్ ఒకటి. ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది వారి లోకాన్ని మరిచిపోతున్నారు. కొంతమంది మాట్లాడుతూ.. ఎక్కడికి వెలుతున్నామో తెలియని పరిస్థితి. మరికొందరు మతిమరుపుతో వారి ఇంటిలో వస్తువులను మరిచిపోయి బయటకి విసిరేయడం, ఇంకొందరు అయితే వారి పిల్లలను వదిలిపెట్టి ఫోన్‌లో మునిగిపోవడం లాంటి ఘటనలు చాలానే చూశాం.


కానీ ఇక్కడ జరిగిన ఘటన అంతకు మించి ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన సీన్ అలాంటి ఇలాంటి సీన్ కాదు. ఫోన్ తన పాలిట యమపాశంలాగా మారిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తన పెంపుడు కుక్కని స్నానం చేయించడం కోసం నీటిలో హీటర్ పెట్టాల్సింది మరిచిపోయి తన చంకలో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి.దీంతో షాక్‌కి గురై మృతి చెందడంతో ఖమ్మం జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఖమ్మం పట్టణంలోని స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు అనే వ్యక్తి ఆదివారం రాత్రి తన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయాడు. ఈ గ్యాప్‌లో తనకు ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. వాటర్‌ హీటర్‌ను నీటిలో వేసే బదులు తన చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశాడు. దీంతో విద్యుత్‌ ఘాతుకానికి గురై ఒక్కసారిగా కింద పడిపోయాడు.

Also Read: బీఆర్ఎస్ వలస నేతలకు కాంగ్రెస్ ‘తాయిలాలు‘ సిద్ధం


దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి మహేశ్ బాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిందని ఆయన మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. కాబట్టి ఏమరపాటుగా ఉంటే కొత్త సమస్యలు తప్పవంటూ ఈ సీన్‌ అందరికి గుర్తు చేస్తుంది. కాబట్టి ఫోన్ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. రోడ్డు దాటేటప్పుడు కూడా ఫోన్‌ మాట్లాడుతూ వాహనాల రాకపోకలని గమనించకుండా ఉంటారు. ఇలాంటి టైమ్‌లో యాక్సిడెంట్లు అయినా ఘటనలు కూడా చాలానే జరిగాయి. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ప్రజలను కోరుతున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×