BigTV English

Maruti Fronx Car Price Drop: ఎగిరి గంతేసే వార్త.. కార్లపై కిక్కిచ్చే డిస్కౌంట్లు.. వదలొద్దు బాబాయ్!

Maruti Fronx Car Price Drop: ఎగిరి గంతేసే వార్త.. కార్లపై కిక్కిచ్చే డిస్కౌంట్లు.. వదలొద్దు బాబాయ్!

maruti cars discounts: దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకికి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందువల్లనే ఈ కార్ల తయారీ కంపెనీ దేశీయ అతిపెద్ద వాహన తయారీదారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో తమ కార్లను లాంచ్ చేస్తూ బాగా ప్రజాదరణ అందుకుంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్లు, ఎస్యూవీలను ప్రస్తుతం సేల్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ సామాన్య ప్రజలే టార్గెట్‌గా తక్కువ ధరలో కార్లను లాంచ్ చేయడం ఒకెత్తయితే వాటిపై ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడం మరో ఎత్తనే చెప్పాలి.


ఇప్పటికే తమ కార్లపై ఎన్నో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించిన కంపెనీ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు నెలలో తమ కార్లపై ఊహించని తగ్గింపు ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏఏ మోడళ్లపై ఆఫర్లు అందిస్తుందో అన్న విషయానికొస్తే.. మారుతి నెక్సా లైనప్‌లో ఉన్న బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్‌ఎల్6, గ్రాండ్ విటారా, ఇగ్నిస్ వంటి మోడళ్లపై అదిరిపోయే తగ్గింపులు పొందవచ్చు. ఇందులో సెలెక్ట్ చేసుకున్న మోడల్‌ని బట్టి తగ్గింపు లభిస్తుంది. ఇందులో ఫ్రాంక్స్ పై లభిస్తున్న ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: ఈ ఆఫర్లు వదలొద్దు మావా.. నిస్సాన్ మాగ్నైట్‌పై ఏకంగా రూ.82 వేలకు పైగా డిస్కౌంట్..!


మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్‌పై మొత్తం రూ.13,000 నుంచి రూ.43,000 వరకు భారీ తగ్గింపు అందుబాటులో ఉంచింది. అలాగే బేస్ వేరియంట్ సిగ్మా పై రూ.3,060 విలువ గల వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్‌ను అందిస్తుంది. దీంతో పాటు క్యాష్ డిస్కౌంట్ కింద రూ.22,500 వరకు అందిస్తుంది. అలాగే టర్బో వేరియంట్లపై రూ.30,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు రూ.43,000 విలువ గల వెలాసిటీ ఎడిషన్‌ యాక్సెసరీస్‌ కిట్‌ని అందిస్తున్నారు. అయితే వీటన్నింటితో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 లేదా రూ.15,000 ఆప్షనల్ స్క్రాపేజ్ బోనస్‌ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ వేరియంట్లతో పాటు పెట్రోల్ వేరియంట్లు అయిన డెల్టా, డెల్టా ప్లస్‌లపై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో పెట్రోల్ ఏఎంటీ వేరియంట్లపై రూ.25,000 నగదు తగ్గింపు పొందొచ్చు. అందువల్ల తక్కువ ధరలో ఒక మంచి కారును డిస్కౌంట్లతో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదే మంచి అవకాసం అని చెప్పాలి. కాగా ఈ కారు రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య లభిస్తుంది. ఈ కారు మూడు వేరియంట్లలో వచ్చింది. అందులో నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, ఎర్త్ బ్రౌన్ వంటి కలర్‌లు ఉన్నాయి.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×