E-Paper
Advertisement

Keerthy Suresh: ప్రభాస్ కల్కి ఆఫర్ ని రిజెక్ట్ చేశా.. నాగీ అడిగినా కూడా చేయనని చెప్పా

Keerthy Suresh: ప్రభాస్ కల్కి ఆఫర్ ని రిజెక్ట్ చేశా.. నాగీ అడిగినా కూడా చేయనని చెప్పా
Advertisement

Keerthy Suresh: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కోరుకుంటుంది. కానీ, కీర్తి సురేష్ మాత్రం ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందంట. అది కూడా కల్కి 2898AD లాంటి హిట్ సినిమాలో. ఈ విషయం స్వయంగా కీర్తి సురేష్ నే తెలిపింది. ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి రఘు తాత. ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కు రెడీ అవుతుంది. హిందీ రాని ఒక తమిళ్ అమ్మాయి కష్టాలను ఇందులో చూపించారు. రి

లీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేసిన కీర్తి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అటు సినిమా గురించి, ఇంకోపక్క తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తి పెంచుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కీర్తి.. కల్కి ఆఫర్ ను రిజెక్ట్ చేశా అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెల్సిందే. నాగీ.. అంతకుముందు తాను తెరకెక్కించిన సినిమాల్లో నటించిన నటీనటులను.. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ కోసం వాడుకున్నాడు.

Advertisement

చిన్నదైనా.. పెద్దదైనా నాగీకి గౌరవమిచ్చి స్టార్లు అందరూ ఈ సినిమాలో నటించారు. ఇక నాగీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మహానటి. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి.. సావిత్రిగా నటించింది. ఈ సినిమా కీర్తికి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కీర్తిని కూడా కల్కిలో భాగం చేయాలనీ అనుకోని.. ఒక రోల్ కోసం ఆమెను సంప్రదించాడట. అయితే కీర్తి సున్నితంగా ఆ రోల్ ను తిరస్కరించిందట.

ఇక దీని గురించి ఆమె మాట్లాడుతూ. “కల్కి సినిమా కోసం నన్ను నాగీ సంప్రదించాడు. కానీ, ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. అయితే ఎలాగైనా కల్కిలో భాగం కావాలనుకున్నా.. ఆ తరువాత నాగీ కాల్ చేసి.. బుజ్జికి వాయిస్ ఇమ్మన్నారు. వెంటనే ఓకే చెప్పేశా. దీనికి నాగీ నాకు ఎంతో హెల్ప్ చేశాడు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తతెలియడంతో కీర్తి రిజెక్ట్ చేసిన ఆ పాత్ర ఏమై ఉంటుందో అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×