E-Paper
Advertisement

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!
Advertisement

Price Hike: స్వేచ్చ బ్యూరో: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు గోళ్లమూడి శ్రీనివాసరావు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం సత్తుపల్లిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఉప్పు, పప్పులు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

భారీగా పెరిగిన ధరలు..

రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పేద ప్రజలకు వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఆదాయాలు పెరగకపోవడంతో పేదల జీవనం భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీనివాసరావు కోరారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధరల పెరుగుదలను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్..

Advertisement

సామాన్యులకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించి, ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సదస్సులో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పరిగడుపు లక్ష్మణ్, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు గద్దల దేవన్న, సత్తుపల్లి మండల కోశాధికారి అయినపూడి సంతోష్, ఎమ్మార్పీఎస్ నాయకులు గంధం రాఘవులు, ప్రజలు బొల్లెపోగు రాములు, కోట బాబురావు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

Also read: ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!

Tags

Related News

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత

రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు.. మంత్రి క్లారటీ!

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!

Big Stories

Advertisement
×