BSNL New Offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత కొద్ది రోజులుగా క్రేజీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులను మరింత ఆకట్టుకునే ప్లాన్స్ ఉంటున్నాయి. దిగ్గజ టెలికాం సంస్థలుగా కొనసాగుతున్న జియో, ఎయిర్ టెల్ కు చెమటలు పట్టేలా ఈ ప్లాన్స్ ను పరిచయం చేస్తోంది. నిజానికి ప్రైవేట్ రంగ సంస్థలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచడంతో BSNL వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు మరింత మందిని ఆకట్టుకునేందుకు చీప్ అండ్ బెస్ట్ ప్లాన్స్ తీసుకొస్తుంది.
రోజూ 3 జీబీ డేటా.. 84 రోజుల వ్యాలిడిటీ
BSNL ఎక్కువ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది. రూ. 599తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకీ అవేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ అన్ని నెట్‌వర్క్ లలో అపరిమిత వాయిస్ కాలింగ్.
⦿ రోజుకు 3 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది.
⦿ 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
⦿ మొత్తంగా 84 రోజులకు 252 జీబీ డేటా అందిస్తుంది.
⦿ రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది.
⦿ దేశం అంతటా ఉచిత జాతీయ రోమింగ్ అందిస్తుంది.
⦿ 400 కంటే ఎక్కువ ఉచిత ఛానెల్స్ ను కలిగి ఉన్న BSNL లైవ్ టీవీ స్ట్రీమింగ్ BiTVకి ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
సరళమైన ధరకు ఎక్కువ డేటా, నిరంతరాయ కాలింగ్ కావాల్సిన వారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు అపరిమిత కాల్స్, డేటాతో దీర్ఘకాలిక, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, BSNL తాజా ఆఫర్ ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
BSNLక్రేజీ ఆఫర్.. రూ.1కే సిమ్
అటు BSNL మరో క్రేజీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అద్భుతమైన ప్లాన్ లో భాగంగా వినియోగదారులకు కేవలం రూ.1కే సిమ్ కార్డును అందిస్తుంది. ఈ ఆఫర్ తో 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. అంతేకాదు, ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని BSNL ప్రకటించింది.
Read Also: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!
దేశం వ్యాప్తంగా BSNL 4G విస్తరణ
దేశం అంతటా 75,000 కంటే ఎక్కువ కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా BSNL తన 4G నెట్ వర్క్ ను వేగంగా విస్తరిస్తుంది. కంపెనీ త్వరలో 1 లక్ష టవర్ల లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉంది. నెట్ వర్క్ కవరేజ్, వేగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
Read Also: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!