E-Paper
Advertisement

Karimnagar: మరీ ఇంత దారుణమా.. నెంబర్ లేని జేసీబీతో పొలంలో ఉన్న రైతు పై దాడి!

Karimnagar: మరీ ఇంత దారుణమా.. నెంబర్ లేని జేసీబీతో పొలంలో ఉన్న రైతు పై దాడి!
Advertisement

Karimnagar: స్వేచ్ఛ బ్యూరో: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామంలో భూదౌర్జన్యం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ కారోబార్ తన సొంత పొలానికి దారి కోసం, స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతుతో యాదవ సామాజిక వర్గానికి చెందిన రైతుపై జేసీబీతో హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు మర్రి సమ్మయ్య ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

పట్టా భూమిపై కన్నేసి దాడి..

బాధితుడు సమ్మయ్య పొలానికి ఇరువైపులా దారులు ఉన్నప్పటికీ, పక్కనే ఉన్న కారోబార్ శ్రీనివాస్, అతని బంధువులు సమ్మయ్య పట్టా భూమిని ఆక్రమించుకోవడానికి చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నంబర్ లేని జేసీబీతో సమ్మయ్య పొలంలోకి దూసుకొచ్చి గడ్డి కట్టలను ధ్వంసం చేశారు. “నా పొలంలో ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు?” అని ప్రశ్నించినందుకు, “నిన్ను చంపి అయినా సరే ఇక్కడి నుంచి దారి తీస్తాం” అంటూ కులం పేరుతో దూషించారు. అనంతరం జేసీబీ బకెట్‌తో బలంగా నెట్టడంతో సమ్మయ్య ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also read: Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు.. మానవ హక్కుల కమిటీ వద్దంటూ కోర్టుకు వెళ్లిన తల్లి!

అధికార బలంతో వేధింపులు.. తప్పుడు కేసులు

ఈ దారుణానికి స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము ఇల్లు నిర్మించుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నా, కారోబార్ తన అధికార బలంతో ‘మీ సేవ’ దరఖాస్తులను తిరస్కరిస్తున్నాడని సమ్మయ్య భార్య రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అంతేకాకుండా, తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జేసీబీ డ్రైవర్ (ఎస్సీ సామాజిక వర్గం) ద్వారా తమ కుటుంబంపై తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించేందుకు కారోబార్ కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు.

న్యాయం చేయాలని డిమాండ్..

Advertisement

రాజకీయ, ఆర్థిక బలంతో ఒక రైతు ప్రాణాల మీదకు తెచ్చిన కారోబార్ శ్రీనివాస్, అతనికి సహకరించిన స్థానిక లీడర్లపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతో పాటు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Gomaram Bal Reddy: మేడ్చల్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బాల్‌రెడ్డి!

Related News

1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సీ ఓటర్ సర్వేతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకు.. తెలంగాణలో 8-10 ఎంపీ సీట్లు బీజేపీవేనా?

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

హాస్పిటల్ క్వార్టర్స్‌లో దారుణం.. 21 ఏళ్ల నర్స్ దారుణ హత్య?

Big Stories

Advertisement
×