Lockup Death: ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. గాదె సాయి కృష్ణ తల్లి విజయ లక్ష్మీ తీరుపై మానవ హక్కుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో న్యాయ పోరాటం కోసం మానవ హక్కుల కమిటీ వద్దని చెప్పడంపై ఆగ్రహం వక్వం చేసింది. సిట్ ఎంక్వైరీ పై మానవహక్కుల కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈకేసులో తీవ్రమైన ఒత్తిడిలు కుటుంబం మీద ఉన్నాయని ఆమేతరుపు లాయర్లు తెల్చి చెప్పారు. గాదె సాయి కృష్ణ లాకప్‌లో మిస్ అయ్యారని విజయ లక్ష్మీ మా దగ్గరకు వచ్చారని మానవ హక్కల కమీషన్ నాయకులు తెలిపారు. దీంతో హ్యూమన్ రైట్స్ కమిటీ నిజ నిర్ధారణ బృందం మార్కాపురం వెళ్ళి సాయి కృష్ణ మిస్ అయ్యాడని గుర్తించామని అధికారులు తెలిపారు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై లీగల్ గా పోరాటం చేస్తామని తల్లి తెలిపారు. సీసీ ఫుటేజ్ మిస్ అవడం సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని తెలిసి సీఐ నాగరాజును అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసుపై సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నామని సాయికృష్ట తల్లి డిమాండ్ చేశారు.
Also Read: Voter Registration: ఈ నెల 24 దాటితే మీ ఓటు మాయం?.. వెంటనే ఈ ఒక్క పని చేయండి!
ఇంతకాలం లీగల్ ఫైట్ చేసిన మమ్మల్ని కాదని గాదె విజయ లక్ష్మీ ఇప్పుడు వేరే వారి దగ్గరకు వెళ్లారని, మానవ హక్కుల కమిటీ న్యాయ పోరాటం చేయడానికి ఇది మొదలు కాదు చివరిధీ కాదు. వ్యవస్థలో లోపాల వల్ల లాకప్ డెత్ లాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. లాకప్ డెత్ అనేది సాయి కృష్ణకు మాత్రమే జరిగిన అంశంగా మేము చూడటం లేదు సమాజానికి జరిగిన అన్యాయంగా చూస్తున్నామని తెలిపారు. సాయి కృష్ణ తల్లి విజయ లక్ష్మీని బాధితురాలిగా మాత్రమే చూస్తున్నాంమని, ఈ కేసుపై సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు తెలీదని అన్నారు. మానవ హక్కుల కమిటీ గొడుగు లాంటిదని, మా అవసరం తీరిపోయింధని ఆమెకు పక్కకు వెళ్లారు ఏమో అని తెలిపారు. మాకు సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారని తెలిసిందని, బలహీనమైన వ్యవస్థలో న్యాయం జరుగుతుంది మేము అనుకోవడం లేదని మానవ హక్కుల కమీషన్ తెలిపింది.
సిట్ సాక్షుల 164 స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవడం లేదు. సీసీ కెమెరాల ఫుటేజ్ లేదని సిట్ చెప్తుంది దీనిపై ఏమి సమాధానం చెప్తారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంధని ప్రశ్నించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకు ఎందుకు అప్పగించడం లేదని సాయి కృష్ణ పిన్ని న్యాయవాది కనకదుర్గా ప్రశ్నించారు. విజయలక్ష్మికి ఒత్తిళ్ళు ఎక్కవ ఉన్నాయి ఏమో అందుకే మానవ హక్కుల కమిటీ వద్దని కోర్టుకు చెప్పిందని తెలిపారు. నాకు కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారని అన్నారు. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకొని రావడానికి కూడా హైడ్రామా నడిపించారని, హైడ్రామా ఎవరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదని తెలిపారు. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా నేను పిన్నిగా సాయి కృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తానని కనకదుర్గా తెలిపారు.
Also read: Mudragada Funeral: ముద్రగడ అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్!