E-Paper
Advertisement

అక్కడ అడవులు నడుస్తాయట.. ఇదేం చిత్రం భయ్యా!

అక్కడ అడవులు నడుస్తాయట.. ఇదేం చిత్రం భయ్యా!
Advertisement

Romania’s Walking Forests: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన అడవులు ఉన్నాయి. వాటిలో కొన్ని వింతైన అడువులు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నడిచే అడవి. అడవి నడవడం ఏంటి? అని ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. ఈ అడవులు రొమేనియాలో ఉన్నాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో చెట్లు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా తమ స్థానాన్ని మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. ముఖ్యంగా బుజౌ ప్రాంతం, కార్పాతియన్ పర్వతాల పరిసరాల్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే స్థానికులు వాటిని నడిచే అడవులు అని పిలుస్తుంటారు. మొదటిసారి చూసినవారికి ఇది ఏదో మాయలా అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ప్రకృతి మాయాజాలం ఉంది. ఇంతకీ అదేంటని ఇప్పుడు తెలుసుకుందాం..

చెట్లు ఎందుకు వంగి కనిపిస్తాయి?

ఈ అడవుల్లోని చాలా చెట్ల కాండాలు కొండ దిగువ వైపు కొద్దిగా వంగి ఉంటాయి. రోజూ చూసేవారికి ఈ మార్పు పెద్దగా కనిపించదు. అయితే, కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత పోల్చి చూస్తే చెట్ల స్థానం కొద్దిగా మారినట్లు తెలుస్తుంది. అందుకే అవి నడుస్తున్నాయనే భావన కలుగుతుంది. అయితే, ఈ వింతకు అసలు కారణం మట్టి జారడం. ఇది చాలా నెమ్మదిగా జరిగే సహజ భూగర్భ ప్రక్రియ. కొండ ప్రాంతాల్లో గురుత్వాకర్షణ ప్రభావంతో నేల పైభాగం మెల్లగా కిందికి కదులుతుంది. ఈ కదలిక చాలా స్వల్పంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏడాదికి కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే భూమి జారుతుంది. అందుకే ఈ మార్పు ఒక్కసారిగా కనిపించదు.

వర్షాలు కూడా కీలక పాత్ర

Advertisement

రొమేనియాలోని ఈ ప్రాంతాల్లో నేలలో బంకమట్టి, ఇసుక, భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం పడినప్పుడు నీరు మట్టిలోకి చేరి, దానిని మరింత మెత్తగా మారుస్తుంది. దీంతో నేల సులభంగా జారే పరిస్థితి ఏర్పడుతుంది. భూమి నెమ్మదిగా కదులుతున్న కొద్దీ, దానిపై పెరిగిన చెట్లు కూడా అదే దిశగా కొద్దికొద్దిగా కదులుతాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఖనిజ జలాల ఊటలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎండాకాలంలో కూడా నేలను తడిగా ఉంచుతాయి. తడి నేల త్వరగా జారే అవకాశం ఉండటంతో మట్టి కదలిక మరింత సులభమవుతుంది. అందుకే ఈ ప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చెట్లు ఎందుకు కూలిపోవు?

భూమి కదులుతున్నా చెట్లు వెంటనే కూలిపోవు. ఎందుకంటే వాటి వేర్లు నేలను బలంగా పట్టుకుని ఉంటాయి. భూమి కొద్దికొద్దిగా జారుతున్నప్పుడు వేర్లు కూడా దానికి అనుగుణంగా సర్దుకుపోతాయి. దీంతో చెట్లు నిలబడి ఉంటూనే, మట్టితో పాటు నెమ్మదిగా ముందుకు కదులుతాయి. అందుకే వాటి కాండాలు వంగిన ఆకారంలో కనిపిస్తాయి.

ప్రకృతి చూపించే అరుదైన అద్భుతం

Advertisement

ఇలాంటి చెట్లను చూసిన స్థానికులు చాలా కాలం పాటు ఇది ఏదో విచిత్రమైన ప్రకృతి అద్భుతమని భావించారు. కొందరు దీనికి అతీంద్రియ శక్తులు కారణమని కూడా నమ్మేవారు. కానీ, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, భూమి నెమ్మదిగా కదలడమే దీనికి అసలు కారణమని నిర్ధారించారు.అయినప్పటికీ, ఈ అడవులు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులను, శాస్త్రవేత్తలను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

Read Also: ఆ ఊళ్లకు అస్సలు రోడ్లు ఉండవు.. అయినా అక్కడి లైఫ్ భలే హ్యాపీ!

Related News

రంగుల నది.. విభిన్న వర్ణాలతో స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతం ఎక్కడుందంటే?

హైదరాబాద్–తిరుపతి విమానాలకు ఫుల్ డిమాండ్.. చుక్కల్లోకి టికెట్ ధరలు!

ఆ ఊళ్లకు అస్సలు రోడ్లు ఉండవు.. అయినా అక్కడి లైఫ్ భలే హ్యాపీ!

ప్రధాని చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!

అమెరికాలో సెటిల్ అవ్వాలంటే.. ఈ 5 రాష్ట్రాలు బెస్ట్.. ఎందుకంటే?

కుతుబ్ షాహీల కాలం నాటి రహస్య కోట.. నేటి ఐటీ హబ్.. దుర్గం చెరువుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

10 వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా ఈ సోలార్ రైలు ఎక్కాల్సిందే!

Big Stories

Advertisement
×