E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి ‘కేబినెట్’ వ్యూహం.. అసలు బాంబు పేల్చిన న్యాయ నిపుణులు!

సీఎం రేవంత్ రెడ్డి ‘కేబినెట్’ వ్యూహం.. అసలు బాంబు పేల్చిన న్యాయ నిపుణులు!
Advertisement

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలను చక్కదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు ‘కేబినెట్ హోదా’ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయంగా పెద్ద వ్యూహమే అయినా, దీని వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలపై ఇప్పుడు చర్చ మొదలైంది.

15 శాతం నిబంధన ఏమవుతుంది?

Advertisement

రాజ్యాంగంలోని 91వ సవరణ (ఆర్టికల్ 164-1A) ప్రకారం.. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు. తెలంగాణ అసెంబ్లీ స్థానాల (119) లెక్కన ఇక్కడ గరిష్టంగా 18 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడానికి వీలుంది. ఇద్దరు విప్‌లకు కేబినెట్ హోదా కల్పించడం ద్వారా పరోక్షంగా ఈ 15 శాతం పరిమితిని దాటినట్లవుతుందా? అనేది న్యాయ నిపుణుల మొదటి ప్రశ్న.

ప్రమాణ స్వీకారం లేకుండా కేబినెట్ హోదా సాధ్యమేనా?

Advertisement

వీరిద్దరితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించలేదు. కేవలం ప్రోటోకాల్, జీతభత్యాలు, సదుపాయాల కోసమే ఈ హోదా ఇచ్చారు. అయితే, గవర్నర్ సమక్షంలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఒక వ్యక్తికి కేబినెట్ మంత్రికి సమానమైన అధికారాలు, సదుపాయాలు కల్పించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. హోదా వేరు, మంత్రి పదవి వేరైనా.. ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం దీని కిందకే వస్తుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

Also Read: పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వైరల్ లేఖ.. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ నిజమేనా?

సుప్రీంకోర్టు గత తీర్పులు ఏం చెబుతున్నాయి?

గతంలో అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శులకు ఇలాంటి హోదాలు కల్పించినప్పుడు న్యాయస్థానాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇలాంటి సమాంతర హోదాలు కల్పించడం రాజ్యాంగ నిబంధనలను పక్కదారి పట్టించడమేనని గతంలో కోర్టులు వ్యాఖ్యానించాయి.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ పొలిటికల్ మేనేజ్‌మెంట్ నిర్ణయం పార్టీలో అసంతృప్తిని చల్లార్చడానికి తాత్కాలికంగా ఉపయోగపడినా, రేపు ఎవరైనా దీనిపై కోర్టుకు వెళ్తే న్యాయపరంగా ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related News

1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సీ ఓటర్ సర్వేతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకు.. తెలంగాణలో 8-10 ఎంపీ సీట్లు బీజేపీవేనా?

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

హాస్పిటల్ క్వార్టర్స్‌లో దారుణం.. 21 ఏళ్ల నర్స్ దారుణ హత్య?

Big Stories

Advertisement
×