BigTV English

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Fire Accident: హాలియాలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన స్థానికులు పైన ఉన్న అపార్ట్‌మెంట్ వారిని అప్రమత్తం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కానీ, భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం తెలిపారు..


భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు
పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా హాలియా సమీపంలోని ఎస్‌బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్‌మెంట్‌ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఘటన వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read: కాంగ్రెస్‌లో దుమారం రేపిన మంత్రి పొన్నం వ్యవహారం


కంప్యూటర్ షట్ డౌన్ చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్..
అయితే ఈ ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రి బూడిద మొత్తం అయ్యాయి. బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. ఈ ఘటనకు కారణం బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్‌ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి.

Related News

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే

Telangana politics: జూబ్లీహిల్స్ బైపోల్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఈసారికి అలా ముందుకు

Ponnam Prabhakar: వివాదానికి ఫుల్‌స్టాప్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..! రాజకీయ వర్గాల్లో ఆసక్తి..

TGPSC Group-1: టీజీపీఎస్సీకి గుడ్ న్యూస్.. గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

Uttam Kumar Reddy: వానాకాలం ధాన్యం కొనుగోలుపై.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?

Big Stories

×