#VD15: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి.. తన నటనతో అభిమానుల హృదయాలను దోచుకున్నారు. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలో నటించారు కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. చివరిగా ‘కింగ్డమ్’ అంటూ వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ దేవరకొండ. పైగా ఈ సినిమా కూడా నిరాశను మిగిల్చింది. ఇటీవల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు (Dilraju) విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన్’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కథ ఏంటి? షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ? ఇందులో నటీనటులు ఎవరు? అంటూ పలు రకాల వార్తల వైరల్ అవ్వగా.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు , షూటింగ్ తో పాటు ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు? అనే విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.
also read:Mohan Babu: మంచు ఫ్యామిలీకి భారీ షాక్..గుర్తింపు రద్దు కానుందా?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఈనెల 11వ తేదీన లాంఛ్ చేయనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆరోజు చాలా ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఈనెల 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.. ఈ చిత్రానికి రవి కిరణ్ (Ravi kiran) దర్శకత్వం వహించగా.. ఇందులో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ పై ఇప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.
విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే…గత కొంతకాలంగా హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనికి తోడు అక్టోబర్ 3వ తేదీన ఇరు కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వేడుకపై కూడా వీరు క్లారిటీ ఇవ్వలేదు. మరొకవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగబోతుందని సమాచారం.
నిశ్చితార్థం తర్వాత పుట్టపర్తిలోని సత్యసాయి మహా సమాధిని ఫ్యామిలీతో సహా సందర్శించారు విజయ్ దేవరకొండ. ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన క్రమంలో మధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగింది. అయితే కార్లో ఉన్నవారికి ఏం కాలేదు కానీ కారుకు మాత్రం భారీగా డామేజ్ అయినట్లు సమాచారం. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. దేవుడి దయతో మేమంతా బాగున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు.