Ponnam Prabhakar: రాజకీయాల్లో మాటలే నిలబెడతాయ్! తేడా కొడితే ఆ మాటలే పడగొడతాయ్. ఇది తెలియకుండా దిగజారి మాట్లాడితే.. బజారునపడటం ఖాయం. మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి ఇప్పుడు నడుస్తున్న చర్చ కూడా ఇదే! తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయ్. మంత్రి హోదాలో ఉండి.. ఇలా మాట్లాడటం కరెక్టేనా?
మంత్రి హోదాలో ఉండి పొన్నం ప్రభాకర్ ఇలా అనడమేంటి?
సొసైటీలో పెద్దగా గుర్తింపు లేనోళ్లు, ఏ పదవి, హోదా లేని వాళ్లు.. ఏది మాట్లాడినా చెల్లుతుంది. కానీ.. మంత్రి హోదాలో ఉండి.. నోరు జారితే మాత్రం అది కచ్చితంగా పేలుతుంది. ఇందుకు.. పొన్నం ప్రభాకర్ ఎపిసోడే లేటెస్ట్ ఎగ్జాంపుల్. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారాయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఓ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలస్యంగా రావడంపై.. పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్‌తో మాట్లాడుతూ.. దున్నపోతు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయ్. పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా? అంత దురుసుతనం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్..
ఇప్పుడే కాదు.. గతంలోనూ పొన్నం ప్రభాకర్ వేదికలపైనా, ప్రెస్‌మీట్లలోనూ, అసెంబ్లీలోనూ వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. మంత్రి హోదాలో ఉండి.. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి.. ఇలా ఎలా మాట్లాడతారనే చర్చ జరుగుతోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. పొన్నం వ్యాఖ్యలపై స్పందించారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే.. పొన్నం ప్రభాకర్ మాత్రం తాను ఎవరినీ అవమానించలేదని.. తన మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. ఈ వివాదంతో.. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బయటపడటంతో.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరు మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. పొన్నం, అడ్లూరి మధ్య సంధి కుదిర్చే వ్యవహారాన్ని.. మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించారు పీసీసీ చీఫ్. మంత్రులిద్దరితో మాట్లాడి.. ఇష్యూ సెటిల్ చేయాలని కోరారు.
Also Read: వైఎస్ జగన్‌కు పోలీసులు షాక్.. విశాఖ రోడ్ షోకి నో పర్మిషన్
మంత్రి అడ్డూరి, పొన్నం వివాదాన్ని.. పీసీసీ ఎలా సెటిల్ చేస్తుంది?
మంత్రి అయినా, ముఖ్య నేతలైనా, ప్రజాప్రతినిధులైనా.. పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరం. ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. సహచర మంత్రుల గురించి అయినా, ప్రత్యర్థుల గురించి అయినా.. దురుసుగా మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ముఖ్యంగా.. మంత్రులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలే గానీ.. ఇలా నోరు జారి బజారునపడితే.. తమ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. మరి.. పొన్నం, అడ్లూరి వివాదాన్ని.. పీసీసీ ఎలా సెటిల్ చేస్తుంది? ఇద్దరి మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని ఎలా సరిచేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.