Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో పక్క నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా విజయాలు అందుకుంటున్న ఈ హీరో రీసెంట్ గా నిర్మించిన కొత్త లోక మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా ఈ హీరోకి కార్ల పిచ్చి ఉందన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. లగ్జరీ కార్ల కలెక్షన్లలో ఈ హీరో ముందు వరసలో ఉంటాడు. ప్రస్తుతం ఈ హీరో దగ్గర ఉన్న లగ్జరీ కార్ల గురించి మనం ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
హీరోగా ప్రొడ్యూసర్ గా బీభత్సంగా సంపాదిస్తున్న ఈ స్టార్ హీరోకి కార్లంటే విపరీతమైన క్రేజ్. తన కార్ల కోసం తన తండ్రి ముమ్ముట్టి తో కలిసి 369 అనే సొంత గ్యారేజీనే మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో తన కార్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈయన దగ్గర మామూలు కార్ల నుంచి ఫెరారీ కార్ల వరకు అన్ని రకాల బ్రాండెడ్ కార్లు ఆయన గ్యారేజీ లో ఉన్నాయి. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా సరే దుల్కర్ తన ఇంట్లోకి దాన్ని తెచ్చి పెట్టుకుంటాడని పలు సందర్భాల్లో కొన్ని మీడియాలో వార్తలు కూడా వినిపించాయి. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో మరోవైపు కార్ల కలెక్షన్లను మిస్ అవ్వకుండా చేసుకుంటాడు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ అందరి హీరోలాగా బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేయాలని అనుకోవడం లేదు. కేవలం ఖరీదైన కార్లను కలెక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఆయన గ్యారేజీలో ఎన్నో కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న ఖరీదైన కార్ల లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
1. మెర్సిడెస్-బెంజ్ Maybach బ్రాండ్‌లోని లగ్జరీ సూప్ ఇది. బిజనెస్, తదితర వాటికి ఉపయోగపడడంతో పాటుగా స్టైల్ గా కూడా ఉండడంతో ఈ కారును దుల్కర్ 2023లో కొనుగోలు చేశారు.
2. అడ్వాన్స్డ్ ఫెరారీ 296 కారు. ఇది ఒక స్పెషల్ డీప్ రెడ్ షేడ్. దీనిని కూడా అతను 2023 కొనుగోలు చేశారు.
3. ఫెరారీ 458 కారు.. ఇది 2014 మోడల్.. అప్పట్లో నాలుగున్నర కోటి పెట్టి కొనుగోలు చేశారు.
4. పోర్షే కారు 2018 లో కొన్నాడు. దీని ధర అప్పట్లో 2 .3 కోట్లు. ఇంకా ఇవే కాకుండా అనేక బ్రాండ్ల కార్లు తన 369 గ్యారేజీ లో ఉన్నాయి.
Also Read : అక్కడ ‘కాంతార 2’ కలెక్షన్స్ దారుణం.. భారీ నష్టం తప్పదా..?
నిజానికి 369 అనేది ఆయన ఫేవరెట్ నెంబర్. అందుకే ఆయన గ్యారేజీలోని కార్లకు ఎక్కువగా ఈ నెంబర్ తోనే ఉండడం విశేషం. ఇక దుల్కర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా వరుసగా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నాడు.