E-Paper
Advertisement

Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?

Harish Rao : సీఎం రేవంత్ సవాల్‌కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?
Advertisement

గోదావరి నదీ జలాలపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సీఎం రేవంత్ సైతం కేబినెట్ భేటీ అనంతరం స్పందించారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామని అందుకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తాజాగా సీఎం సవాల్‌కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. పొరుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా, స్వరాష్ట్రానికి నష్టం వాటిల్లేలా రేవంత్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తేల్చుకుందామని ప్రతిసవాల్ విసిరారు. కాగా, మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఆధారాలతో వస్తామన్న కాంగ్రెస్..

గోదావరి నదీ జలాల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలు, ఆధారాలతో మరోసారి సభకు రానున్నట్టు తెలుస్తోంది.గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు అప్పుడు పొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలు, నీటి కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలకు సంబంధించిన ఆధారాలతో హాజరవ్వాలని చూస్తున్నట్టు తెలిసింది.గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వాలని చూస్తున్నది.గతంలో ఆధారాలతో వెళ్లినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అడిగే ప్రశ్నలకు వారు సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిని అవలంభించినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

నోటి మాటలేనా?

Advertisement

బీఆర్ఎస్ పార్టీ గతంలో పదేండ్లు అధికారంలో ఉన్నది. అప్పుడు కాళేశ్వరం పేరిట మహారాష్ట్రతో పలు ఒప్పందాలు చేసుకున్నది. అలాగే కృష్ణా నదీ జలాలు, గోదావరి మిగులు జలాల్లో ఏపీతోనూ పలు ఒప్పందాలు చేసుకున్నది. ఇందులో ఏపీకి అగ్రవాటా, తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాల కారణంగానే ఇప్పుడు ఏపీ.. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెబుతున్నదని మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ నాడు అలాంటి ఒప్పందాలు చేసుకోకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని అంటున్నారు. కాగా, బీఆర్ఎస్ మాత్రం తాము అలా చేయలేదని… కేవలం నోటి మాటలు చెబుతున్నది. కానీ, ఆధారాలు మాత్రం చూపడం లేదు. అధికార పార్టీకి ఆధారాలు చూపిస్తే వారెందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump: భారత్‌ను ఆపకపోయుంటే.. పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

సభలో ఉంటారా? వెళ్తారా?

Advertisement

గత అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాలపై చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు తనను బాడీ షేమింగ్ చేశారని సభ నుంచి వాకౌట్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దీనికి తోడు సెషన్స్‌ను సైతం ఆయన బాయ్ కాట్ చేశారు. మొత్తం సెషన్స్ ను బాయ్ కాట్ చేయడం వలన ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తలేదని.. విలువైన సభా సమయాన్ని గాలికి వదిలేశారని సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే,ఈసారి మరోసారి గోదావరి నదీ జలాలపై సీఎం చర్చకు ఆహ్వానించారు. అందుకు హరీశ్ రావు సిద్ధమంటూ జవాబిచ్చారు. మరి ఈసారైనా సభలో అర్థవంతమైన చర్చ జరుపుతారా? ఈసారి కూడా తమను అది, ఇది అన్నారని.. సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ సోషల్ మీడియాలో పలువురు చర్చకు తెరలేపారు.

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×