E-Paper
Advertisement

Cold Weather EV Car: కూల్ వెదర్ లో ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి!

Cold Weather EV Car: కూల్ వెదర్ లో ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి!
Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, పెట్రో కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్యంత వేడి వాతావరణంతో పాటు అత్యంత కూల్ వెదర్ లో ప్రయాణాలు కొనసాగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీవ్రమైన చలి వాతావరణం బ్యాటరీ పనితీరు, పరిధి, మొత్తం భద్రతను ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఎలక్ట్రిక్ కారును నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ డ్రైవింగ్ కు ముందు ప్రీ హీట్ చేయండి!   

చల్లని వాతావరణం బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ప్రయాణ పరిధిని తగ్గిస్తుంది. బ్యాటరీ పని తీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే, ప్రయాణానికి ముందు కారు ఆన్ చేసి, కాసేపు హీట్ చేయాలి. బ్యాటరీ రిజర్వ్‌ ను ఖాళీ చేయకుండా క్యాబిన్, బ్యాటరీని వేడెక్కేలా చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పనితీరు నార్మల్ గా ఉంటుంది. గరిష్ట పరిధిని చేరుకునే అవకాశం ఉంటుంది.

⦿ తరచుగా ఛార్జ్ చేయండి!

Advertisement

తక్కువ ఉష్ణోగ్రతలు బ్యాటరీ కెమిస్ట్రీని నెమ్మదించేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పరిధిని 30 శాత వరకు తగ్గిస్తాయి. బ్యాటరీ హెల్దీగా ఉండేందుఉ వీలైనప్పుడల్లా EVని ప్లగిన్ చేసి ఉంచాలి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌ల కోసం వెళ్లే సమయంలో  మార్గం మధ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో? లేవో? చెక్ చేసుకుని వెళ్లడం మంచిది.

⦿ పర్యావరణ అనుకూల డ్రైవింగ్ పద్ధతులు

చల్లని వాతావరణంలో ఎలక్ట్రిక్ కారు ఎక్కువ పవర్ ను తీసుకుంటుంది. ముఖ్యంగా హీటర్లు, డీఫ్రాస్ట్ సిస్టమ్‌ ల కోసం అదనపు పవర్ ను ఉపయోగించుకుంటుంది. అందుకే, మరీ ఎక్కువ స్పీడ్ తో వెళ్లకూడదు. ఎక్కువ స్పీడ్ కారణంగా బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎకో లేదంటే రేంజ్ మోడ్‌ను ఉపయోగించండి.  అవసరం లేనప్పుడు క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను ఉపయోగించడం మానేయాలి.

⦿ తీవ్రమైన చలి నుండి బ్యాటరీని కాపాడాలి!

Advertisement

ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ హెల్త్ అనేది చాలా ముఖ్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చలి సమయంలో బయట కాకుండా గ్యారేజ్, షెల్టర్డ్ ఏరియాలో పార్క్ చేయాలి. ఒకవేళ బయట పార్క్ చేయాల్సి వస్తే, మీ మోడల్‌  తగిన థర్మల్ బ్యాటరీ కవర్ ను కప్పడం మంచిది.

⦿ టైర్లు, బ్రేక్‌లు, ఫ్లూయిడ్స్ చెక్ చేయండి!  

చల్లని వాతావరణం బ్యాటరీతో పాటు కారులో ఇతర భద్రతా వ్యవస్థలు కూడా ప్రభావితమవుతాయి. మంచుతో నిండిన రోడ్లపై మెరుగైన ట్రాక్షన్ కోసం శీతాకాలంలో ఆల్ సీజన్ టైర్లను ఉపయోగించండి. తీవ్రమైన చలిలో రీజెనరేటివ్ బ్రేకింగ్ భిన్నంగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్, కూలెంట్‌ ను చెక్ చేయాలి. కొన్ని EVలు బ్యాటరీ థర్మల్ మెయింటెనెన్స్ కోసం కూలెంట్‌ను ఉపయోగిస్తాయి.

Read Also: హోమ్ ఛార్జింగ్ vs పబ్లిక్ ఛార్జింగ్.. ఎలక్ట్రిక్ కారుకు ఏది చీప్ అండ్ బెస్ట్?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×