E-Paper
Advertisement

Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్

Harishrao react: అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి వ్యవహారం.. నోరు ఎత్తిన బీఆర్ఎస్
Advertisement

Harishrao react: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ-కౌశిక్‌రెడ్డి సవాళ్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్యగా వర్ణించారు హరీష్‌రావు. అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండించారాయన.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరని అన్నారు హరీష్‌రావు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement

ALSO READ: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్, రెచ్చిపోయిన గాంధీ అనుచరులు, రాళ్లతో దాడి

ఎమ్మెల్యే గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీష్‌రావు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారాయన. హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

ఎమ్మెల్యే అరికెపూడి‌ గాంధీ, ఆయన అనుచరులపై హత్యానేరం కింద కేసు పెట్టాలని సీపీ మహంతి, డీజీపీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల రక్షణ గురించి స్పీకర్ ఆలోచించాలన్నారు. ప్రస్తుతం సిద్ధిపేటలో ఉన్న ఎమ్మెల్యే హరీష్‌రావు.. హైదరాబాద్‌కు బయలుదేరారు.

Related News

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×