BigTV English

Bigg Boss 8 Telugu: వాళ్లిద్దరితో అదే కనెక్షన్.. ప్లేట్ మార్చేసిన సోనియా.. షాక్‌లో పృథ్వి, నిఖిల్

Bigg Boss 8 Telugu: వాళ్లిద్దరితో అదే కనెక్షన్.. ప్లేట్ మార్చేసిన సోనియా.. షాక్‌లో పృథ్వి, నిఖిల్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించిన ప్రతీ సీజన్‌లో లవ్ స్టోరీలు అనేవి కామన్. ఇద్దరు కంటెస్టెంట్స్ క్లోజ్‌గా ఉంటే చాలు.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు ఫీలవుతారు. అలాగే కొన్ని సీజన్స్‌లో అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు కూడా నడిచాయి. అదే విధంగా బిగ్ బాస్ 8లో కూడా సోనియా, పృథ్విరాజ్, నిఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని ప్రేక్షకులు భావించారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో పృథ్వి, నిఖిల్‌కు మాత్రమే కాదు.. ఆడియన్స్‌కు కూడా బిగ్ షాకిచ్చింది సోనియా. అసలు పృథ్వి, నిఖిల్‌తో తనకు ఎలాంటి కనెక్షన్ ఉందో హౌజ్‌మేట్స్ అందరి ముందు వివరించింది. దీంతో నెటిజన్లు మరోసారి తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


కనెక్షన్ వచ్చింది

బిగ్ బాస్ 8 ప్రారంభమయిన మొదటి వారంలో సోనియా.. ఎవరితో పెద్దగా క్లోజ్‌గా ఉండేది కాదు. ఎవరు ఏం మాట్లాడినా రివర్స్ మాట్లాడుతూ, సంబంధం లేకుండా అరుస్తూ గొడవలు పడుతూ ఉండేది. అలా మెల్లగా నిఖిల్‌తో క్లోజ్ అయ్యింది. పృథ్విరాజ్ వచ్చి సోనియాతో క్లోజ్ అవ్వాలని చూశాడు. దీంతో తనతో కూడా సోనియా బాగానే ఉండేది. అలా ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ సోనియా.. వారిద్దరితో ఉండే తీరు చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా రన్ అవుతుందా అని సందేహాలు కూడా మొదలయ్యాయి. ఒకసారి హౌజ్‌మేట్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అసలు పృథ్వి, నిఖిల్‌తో తనకు అంత కనెక్షన్ ఎలా వచ్చిందో వివరించింది సోనియా.


Also Read: ‘బిగ్ బాస్’ మణికంఠ ఎమోషన్స్‌ను హేళన చేసిన బుల్లితెర నటి.. సారీ చెప్పక తప్పలేదుగా!

షాకయ్యారు

‘‘నాకు, నిఖిల్‌కు ఫుడ్ వల్లే కనెక్షన్ ఏర్పడింది. మా పెద్దన్నయ్య యశ్ వండినట్టుగా వండుతావు. చాలా ఇష్టంతో, ప్రేమతో అందరికీ వండిపెడతావు. అది నాకు ఫ్యామిలీ కనెక్షన్‌లాగానే అనిపిస్తుంది. పృథ్వి కూడా అంతే. నిఖిల్ పెద్దోడు, పృథ్వి చిన్నోడు అన్నట్టు ఉంటారు’’ అని వివరించింది సోనియా. ఇది విన్న ప్రేక్షకులు షాకవుతున్నారు. నిఖిల్‌తో క్లోజ్ అవ్వడానికి కారణమేంటి అని విష్ణుప్రియా అడిగినప్పుడు ఇదే సమాధానం ఇచ్చి ఉండుంటే గొడవ పెద్దగా అయ్యేది కాదు కదా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా అనవసరంగా విష్ణుప్రియాతో గొడవ పెద్దగా చేసి, తనపై నీఛమైన కామెంట్లు చేసి, ఆ తర్వాత తనే ఏడ్చి ప్రేక్షకుల దృష్టిలో సింపథీ సంపాదించుకోవాలి అనుకుంది సోనియా.

వారితో పోలిక

కొందరు ప్రేక్షకులు సోనియాను మునుపటి సీజన్స్ కంటెస్టెంట్స్‌తో పోలుస్తున్నారు. కొందరు తనను బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ రతికతో పోలుస్తుంటే మరికొందరు తనను బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్‌తో పోలుస్తున్నారు. మోనాల్ కూడా అప్పట్లో అఖిల్, అభిజీత్‌తో ఒకేలా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపడానికి ట్రై చేసింది. కానీ అభిజీత్ రివర్స్ అవ్వడంతో వారిద్దరి మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు కూడా పృథ్వితో పులిహోర కలుపుతూ నిఖిల్‌ను దూరం పెడుతోంది సోనియా. చివరికి నిఖిల్ మాత్రం తనకు బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ ఫూల్ అయ్యాడు.

Related News

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×