BigTV English

Hair Care Tips: చుండ్రు సమస్య వేధిస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే రిజల్ట్స్​ పక్కా​!

Hair Care Tips: చుండ్రు సమస్య వేధిస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే రిజల్ట్స్​ పక్కా​!

Best Home Remedies for Simple : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య చుండ్రు. ఈ సమస్యను తొలగించేందుకు వాడని షాంపూ ఉండదు. చేయని ప్రయత్నం ఉండదు. చండ్రు రావడానికి ప్రధాన కారణం పొల్యూషన్, జీవిన శైలిలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తలపై చుండ్రు ఎక్కువైతే క్రమేనా చర్మ సమస్యలు కూడా వస్తాయి. చుండ్రు సమస్యల వల్ల ఏకాగ్రత కూడా దెబ్బ తింటుందట. చండ్రు సమస్యలు తొలగించేందుకు ఖరీదైన షాంపులు, రకరకాల ప్రొడక్ట్స్‌లు కొనాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాలు పాటిస్తే సరి.


నిమ్మరసం
చుండ్రు సమస్యలను తగ్గించడంలో నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి చుండ్రును తొలగించడంలో, జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపి తలకు అప్లై చేయాలి. ఒక అరగంటసేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు
చుండ్రు సమస్యతో బాధపడేవాళ్లు తలకు పెరుగు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో ప్రొటీన్స్, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ వంటి పదార్ధాలు అధికంగా ఉంటాయి. పెరుగులో కొంచెం బేకింగ్ షోడా కలిపి జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు.


తులసి, వేప నీరు.
తులసి, వేప ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో వేప, తులసి ఆకులు వేసి బాగా మరిగించండి. చల్లారిన తర్వాత ఆ నీటిని తలకు పట్టించండి. ఒక అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తాయి.

Also Read: షుగర్ పేషెంట్స్ తేనె, బెల్లం తీసుకుంటే మంచిదేనా ?

మెంతి గింజలు
మెంతి గింజలు చుండ్రును తొలగించడంలో అద్బుతంగా పనిచేస్తాయి. దీనికోసం ముందుగా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టించండి. అరగంట  తర్వాత తేలిక పాటు షాంపుతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒత్తిని తగ్గించండి.
ఒక్కువగా ఒత్తిడి గురైనప్పుడు చుండ్రు సమస్యలతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. అందువల్ల మీరు ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఒత్తిని తగ్గించడానికి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు వాడటం తగ్గించండి.
జుట్టుకు సంబంధించి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వాడటం తగ్గించండి. ఉదాహరణకు.. డ్రై షాంపూ, హెయిర్ స్ప్రే వంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×