E-Paper
Advertisement

Harry Potter x MINISO Pop-Up Store: ఇనార్బిట్ మాల్ లో హ్యారీ పోర్ట‌ర్ x మినిసో పాప్-అప్ స్టోర్

Harry Potter x MINISO Pop-Up Store: ఇనార్బిట్ మాల్ లో హ్యారీ పోర్ట‌ర్ x మినిసో పాప్-అప్ స్టోర్
Advertisement

Harry Potter x MINISO Pop-Up Store:  హైదరాబాద్, నవంబర్ 2025: ఇనార్బిట్ మాల్ నగరంలోని హ్యారీ పోర్టర్ అభిమానులకు మాయాజాల ప్రపంచాన్ని ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు నిర్వహించబడే హ్యారీ పోర్టర్ x మినిసో పాప్-అప్ స్టోర్ (Harry Potter x MINISO Pop-Up Store) ద్వారా కుటుంబాలు, యువత, చిన్నారులు అందరికీ సాహసిక అనుభూతిని అందజేయనుంది.

ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్ మినిసో హ్యారీ పోర్టర్ చిత్రాల ఆధారంగా స్కిన్ కేర్, కాస్మెటిక్స్, హోం ఫర్నిషింగ్, స్టేషనరీ, బ్యాగులు మరియు డిజిటల్ యాక్సెసరీస్ వంటి విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. ఈ ప్రత్యేక స్టోర్ హైద‌రాబాద్‌లో మాయాజాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా డెకార్ చేయబడింది.

Advertisement

నిర్వహకులు వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో ఇలాంటి హ్యారీ పోర్టర్ పాప్-అప్ స్టోర్ మొదటిసారి ఏర్పాటు చేయబడింది. స్టోర్‌లో అధికారిక లైసెన్స్ పొందిన మెర్చండైజ్, గ్రిఫిండార్ స్కార్ఫ్‌లు, స్లైథరిన్ మగ్‌లు, ప్లష్ టాయ్స్, కలెక్టిబుల్స్, లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

సందర్శకులు తమ ఇష్టమైన హ్యారీ పోర్టర్ ఉత్పత్తులను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. నెలపాటు హాగ్వర్ట్స్‌లా మాయాజాలం, సాహసం, స్నేహం పూరిత వాతావరణాన్ని ఇనార్బిట్ మాల్‌లో ఆస్వాదించవచ్చు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×