E-Paper
Advertisement

Weather forecast: తెలంగాణపైనే తీవ్ర ప్రభావం.. అలర్ట్‌గా ఉండాలంటూ..

Weather forecast: తెలంగాణపైనే తీవ్ర ప్రభావం.. అలర్ట్‌గా ఉండాలంటూ..
Advertisement

Prediction of Heavy Rainfall in Telangana: వాతావరణ శాఖ తాజాగా పలు సూచనలు చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. రానున్న 24 గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం ఎక్కువగా చూపనున్నదని తెలిపింది. దీంతో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తాయని తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.

Also Read: రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశాలు

Advertisement

తూర్పు, ఈశాన్య జిల్లాలైన పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన కుమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురువొచ్చని వాతావరణ శాఖ పేర్కొన్నది. జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×